Car Insurance: దేశంలో రోజురోజుకూ వాహనచట్టాలను ఉల్లంఘిస్తున్న వ్యక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ప్రజలను ప్రభుత్వాలు ఎన్నిసార్లు దీనిపై అప్రమత్తం చేసినప్పటికీ వాహనదారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు. ఇన్సూరెన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండని పరిస్థితిపై ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయి.
వివరాల్లోకి వెళితే దేశంలో తొలిసారిగా ఒడిశా ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ పేపర్లు లేని వాహనదారులకు ఈపెనాల్టీలు అందించటానికి నిర్ణయించింది. దీనికోసం టోల్ ప్లాజాల వద్ద ఈ-డిటెక్షన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. మెుదటిసారి తప్పుచేసిన వ్యక్తులకు రూ.2,000 పెనాల్టీ విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 3 నెలల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.

ఒకసారి కంటే సార్లు ఇలా దొరికిన వాహనదారులపై రూ.4,000 పెనాల్టీ విధించనున్నట్లు వెల్లడించారు. 1988 మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 146 ప్రకారం ప్రజా రహదారులపై నడిచే ప్రతి మోటారు వాహనానికి చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ ఉండాల్సి ఉంది. వాస్తవానికి అనేక ప్రైవేట్, కమర్షియల్ వాహనాలు చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేకుండా రోడ్లపై నడుస్తున్నాయి. దీని వల్ల రోడ్డు ప్రమాదాల బాధితులకు పరిహారం నిరాకరించబడుతుందని ఒడిశా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే కొత్త వ్యవస్థతో చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేని వారు ఏదైనా సంఘటన జరగడానికి ముందే ప్రతిదీ పొందేలా ఒడిశా ప్రభుత్వం నిర్ధారిస్తుంది.
వాస్తవానికి ఈడిటెక్షన్ వ్యవస్థను బిహార్ రాష్ట్రంలోని 32 టోల్ ప్లాజాల్లో ఇలాంటి వ్యవస్థను ఉంచింది. దీని ద్వారా పొల్యూషన్ సర్టిఫికెట్లు లేని వాహనాలను గుర్తించటానికి వినియోగిస్తున్నారు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని గుర్తించిన వాహనాలకు రూ.10 వేలు పెనాల్టీ విధించబడుతోంది. ఈ వ్యవస్థలను ట్రయల్స్ కోసం ప్రవేశపెట్టినప్పుడు కేవలం 2 రోజుల్లోనే 5,000కి పైగా ఈ-చలాన్లు జారీ చేయబడినట్లు బీహార్ నివేదించింది. రానున్న రోజుల్లో ఈ వ్యవస్థను బీహార్ పాట్నా, ముజఫర్‌పూర్, భాగల్పూర్ సహా ఇతర స్మార్ట్ సిటీలకు విస్తరిస్తామని పేర్కొంది. దీనిని భవిష్యత్తులో దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి వ్యవస్థను వాహన చట్టాలను ఉల్లంఘించే వాహనదారులపై ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది.
కేంద్రం కొత్త ప్రతిపాదన..
అందువల్ల ప్రస్తుతం దేశంలో రోడ్లపై తిరిగే ప్రతి వాహనం విషయంలో తప్పనిసరిగా ఇకపై థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కలిగి ఉండేలా చూసే లక్ష్యంతో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మోటార్ వాహనాల చట్టంలో నిబంధనలను సవరించాలని నిర్ణయించింది. దీనిని అమలులోకి తీసుకురావటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మద్ధతు అవసరమని తెలుస్తోంది. రానున్న రోజుల్లో రోడ్లపైకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాగితాలు లేని వాహనాలు తిరగటాన్ని తగ్గించేందుకు డేటా చాలా కీలకం. అందుకే ఫాస్ట్‌ట్యాగ్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి వాటితో ఆధార్ కార్డులను లింక్ చేయాలనే ప్రతిపాదన కొనసాగుతోంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications