Vehicle Scrappage Policy: కొత్త వాహనం కొంటే డిస్కౌంట్, మినహాయింపు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం (ఆగస్ట్ 13) కొత్త వాహన తుక్కు విధానాన్ని లాంచనంగా ప్రారంభించారు. గుజరాత్‌లో జరిగిన పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ప్రధాని స్వచ్చంధ వాహన తుక్కు విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ స్క్రాపేజీ విధానం వల్ల కాలం చెల్లిన వాహనాలు రోడ్ల మీద తిరగకుండా ఉంటుందని చెప్పారు. కాలం చెల్లిన వాహనాలతో పాటు అన్-ఫిట్ వాహనాలు(ఫిట్‌నెస్ లేని) రోడ్ల మీద తిరిగే అవకాశాలు ఉండవన్నారు. ఈ వెహికిల్ స్క్రాపేజీ పాలసీలో యువతు, స్టార్టప్స్ భాగస్వామ్యం కావాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.

వాహన తుక్కు విధానం వల్ల ఫిట్‌నెస్ లేని వాహనాలకు స్వస్తీ పలికితే కాలుష్యం తగ్గడానికి దోహదపడుతుందని ప్రధాని అన్నారు. ఈ విధానంతో దాదాపు రూ.10వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.
దేశంలో అన్ని విధాలుగా ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నామని, స్థిర, పర్యావరణ అనుకూల ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రవాణా రంగంలో వస్తోన్న ఆధునిక విధానాలు రవాణా, ప్రయాణ భారాన్ని తగ్గించడంతో పాటు ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. ఈ వాహన స్క్రాపేజీ పాలసీ వల్ల మధ్యతరగతి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.

Vehicle Scrappage Policy: Look at key features of this policy?

కేవలం వాహనాల జీవనకాలాన్ని బట్టే కాకుండా ఆటోమేటెడ్ టెస్టింగ్‌లో ఫిట్‌నెస్ లేనివని తేలినా వాటిని తుక్కుగా పరిగణిస్తారన్నారు. తుక్కుగా మారిన పాత వాహనాలకు ధ్రువపత్రం జారీ చేస్తారని, దీంతో కొత్త వాహనం కొనుగోలు చేసే సమయంలో వాహన పన్నులపై రాయితీ లభిస్తుందని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించే పనిలో భాగంగా కాలపరిమితి నిండిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు తెచ్చిన కొత్త పాలసీలో మెరుగైన అవకాశాలు ఉన్నాయన్నారు.

ఇకపై నిరుపయోగంగా ఉన్న వాహనాల్ని దశల వారీగా తగ్గించాలన్నారు. ఈ పాలసీ వల్ల దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు, రిజిస్టర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటుకు వీలవుతుందని తెలిపారు. తుక్కుమారిన పాత వాహనాలకు ధృవపత్రం కూడా జారీ చేస్తారని, దీంతో కొత్త వాహనం కొనుగోలు చేసే సమయంలో వాహన పన్నులపై రాయితీ లభించనుందని ప్రధాని మోడీ తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌త్య‌క్షంగా హాజ‌రైన నితిన్ గ‌డ్క‌రీ మాట్లాడుతూ.. ఈ తుక్కు పాల‌సీ కార‌ణంగా ముడి స‌రుకుల ధ‌ర‌లు 40 శాతం వ‌ర‌కూ త‌గ్గుతాయ‌ని అన్నారు. ఆటోమొబైల్ త‌యారీలో ఇండియా ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్‌గా మారుతుంద‌ని తెలిపారు. దేశంలో ఎటువంటి వ్యాలిడ్ ఫిట్‌నెస్ లేని వాహనాలు దాదాపు 1 కోటి వరకు ఉన్నాయన్నారు. వాహనం వయసునుబట్టి కాకుండా, దాని ఫిట్‌నెస్ ఆధారంగా ఈ స్క్రాపింగ్ పాలసీ వర్తిస్తుందన్నారు. ప‌బ్లిక్ ప్రైవేట్ భాగ‌స్వామ్యంతో దేశంలోని అన్ని జిల్లాల్లో టెస్టింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు గ‌డ్క‌రీ తెలిపారు.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత బడ్జెట్‌లో కొత్త వాహన తుక్కు విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని కింద 20 ఏళ్ల తర్వాత వ్యక్తిగత వాహనాలు, 15 ఏళ్ల తర్వాత కమర్షియల్ వాహనాలకు సామర్థ్య పరీక్షలు ఉంటాయి. ఈ విధానం వల్ల ఇంధన సామర్థ్యం మెరుగు పడటంతో పాటు పర్యావరణహిత వాహనాలకు ప్రోత్సాహం లభిస్తుందని నిర్మలమ్మ తెలిపారు. వాహన తుక్కు విధానం కింద పాతది ఇస్తే, కొత్త దానిపై కంపెనీలు ఐదు శాతం రాయితీ ఇస్తాయని కేంద్ర రవాణాశాఖ ఇది వరకే ప్రకటించింది.

వెహికిల్ స్క్రాపేజీ విధానాన్ని ప్రారంభించిన నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం-టాటా మోటార్స్ మధ్య MoU కుదిరింది. రాష్ట్రంలో స్క్రాపింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుంది టాటా మోటార్స్. 450 నుండి 500 వరకు ఫిట్‌నెస్ కేంద్రాలు, 60 నుండి 70 వరకు వెహికిల్ స్క్రాపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది.

ఇదీ వెహికిల్ స్క్రాపేజీ విధానం

- వెహికిల్ స్క్రాపేజీ విధానంతో పాతబడిన వాహనదారుకు కాస్త ప్రయోజనం చేకూరనుంది.
- స్క్రాపింగ్ కేంద్రంలో పాత వాహనాన్ని ఇస్తే సదరు వాహన స్క్రాపింగ్ ధరను యజమాని పొందుతాడు.
ఇది కూడా వారు కొనుగోలు చేసే కొత్త వాహనం ఎక్స్-షోరూం ధరలో నాలుగు నుండి ఆరు శాతం వరకు ఉండవచ్చు.
- పాత వాహనదారు స్క్రాపింగ్ సెంటర్ రిజిస్టర్ ద్వారా వెనక్కి ఇస్తే స్క్రాపింగ్ సర్టిఫికెట్ అందిస్తారు.
- ఈ స్క్రాపింగ్ విధానం కింద పాత వాహనం ఇస్తే ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కొత్త వాహనం పైన 5 శాతం డిస్కౌంట్ అందిస్తారు. దీనికి స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉండాలి.
- ఈ కొత్త స్క్రాపేజీ పాలసీతో మరో ప్రయోజనం కూడా ఉంది. పర్సనల్ వెహికిల్‌కు రోడ్ ట్యాక్స్ రిబేట్ 25 శాతం వరకు ఉండగా, కమర్షియల్ వాహనాలకు 15 శాతం వరకు ఉంది.
- ఈ కొత్త స్క్రాపేజీ పాలసీ విధానంలో ప్రయివేటు వాహనం 20 ఏళ్ల తర్వాత డీ-రిజిస్టర్ అవుతుంది. అంటే అన్-ఫిట్‌గా తేలినా, కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకపోయినా డీ-రిజిస్టర్ అవుతుంది.
- ప్రయివేటు వాహనాలకు 15 సంవత్సరాల తర్వాత రీ-రిజిస్ట్రేషన్ ఫీజులు వర్తిస్తాయి.
- కమర్షియల్ వాహనాలకు అయితే ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందలేకపోతే పదిహేనేళ్ల తర్వాత డీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
- స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉంటే కొత్త వాహనం కొనుగోలు పైన రిజిస్ట్రేషన్ ఫీజును కూడా మినహాయించవచ్చు.
- కమర్షియల్ వెహికిల్స్‌కు ఏప్రిల్ 1, 2023 నుండి ఫిట్ నెస్ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశముంది. పర్సనల్ వెహికిల్స్‌కు మాాత్రం జూన్ 1, 2024న ప్రారంభం కావొచ్చు.
- మినిస్ట్రీ ఆప్ రోడ్ ట్రాన్సుపోర్ట్ అండ్ హైవేస్(MoRTH) ఈ ఏఢాది ప్రారంభంలో పదిహేను సంవత్సరాల పాత వాహనాల RC రెన్యువల్ ఫీజు పెంపును ప్రతిపాదిస్తూ ముసాయిదా నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+