వాహనదారులకు అలెర్ట్.. నెల రోజుల్లో ఆ పని చేయకపోతే ట్రాఫిక్ చలాన్లు నేరుగా మీ ఇంటికే!

మీకు బైక్ లేదా కారు ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే. తెలంగాణలో వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరూ అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. మీ వెహికల్‌కు సంబంధించి 'వాహన్' (Vahan) డేటాబేస్‌లో మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీలను అప్‌డేట్ చేయడానికి రవాణా శాఖ కేవలం నెల రోజులు మాత్రమే టైమ్ ఇచ్చింది. ఒకవేళ మీ పాత నెంబర్ మారిపోయి ఉంటే, వెంటనే కొత్త నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Vehicle Owners Update Mobile Number Vahan Database Traffic Challan Rules Telangana

కొత్త రూల్ ఎందుకు తెచ్చారు?

సాధారణంగా రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు పోలీసులు ఆన్‌లైన్ ద్వారా ట్రాఫిక్ చలాన్ (traffic challan) విధిస్తుంటారు. అయితే, చాలా మంది వాహనదారుల పాత మొబైల్ నెంబర్లు వాహన్ పోర్టల్‌లో ఉండటం వల్ల వారికి చలాన్ మెసేజ్‌లు వెళ్లడం లేదు. దీనివల్ల "మాకు అసలు చలాన్ పడిన విషయమే తెలియదు" అంటూ చాలా మంది పెనాల్టీలు కట్టకుండా తప్పించుకుంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు కలిసి ఈ జాయింట్ నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇకపై వాట్సాప్, ఎస్ఎంఎస్ (SMS) లేదా ఈమెయిల్ ద్వారా పంపిన చలాన్లు మీకు అధికారికంగా అందినట్టుగానే ప్రభుత్వం భావిస్తుంది. "నాకు మెసేజ్ రాలేదు, నాకు తెలియదు" అనే సాకులు ఇకపై నడవవని అధికారులు స్పష్టం చేశారు.

నెల రోజుల గడువు ముగిస్తే ఏమవుతుంది?

రవాణా శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ వన్-మంత్ డెడ్‌లైన్ ముగిసిన తర్వాత, వాహన్ పోర్టల్‌లో ఉన్న నెంబర్‌కే చలాన్ నోటీసులు పంపుతారు. ఒకవేళ మీ నెంబర్ తప్పుగా ఉండి మీకు మెసేజ్ రాకపోయినా, చలాన్ మీకు డెలివరీ అయిపోయినట్టే లీగల్‌గా లెక్కగడతారు. దీనివల్ల భవిష్యత్తులో పెనాల్టీలు పెరిగిపోవడమే కాకుండా, వెహికల్ ఫిట్‌నెస్ లేదా ఇతర పనుల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

డిజిటల్ ఛానల్స్ ద్వారా చలాన్లను పంపడం వల్ల పేపర్ వాడకం తగ్గడమే కాకుండా, ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాసెస్ చాలా వేగంగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

మీరేం చేయాలి?

వెంటనే మీ వాహనానికి లింక్ అయిన కాంటాక్ట్ డీటెయిల్స్‌ను ఒకసారి వెరిఫై చేసుకోండి. ఒకవేళ నెంబర్ మారితే, వెంటనే అధికారిక వాహన్ పోర్టల్‌లోకి వెళ్లి మీ లేటెస్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకోండి. దీనివల్ల ప్రభుత్వ రవాణా శాఖ నుండి వచ్చే ముఖ్యమైన అలర్ట్లు, చలాన్ల సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. ఆలస్యం చేయకుండా ఈ నెల రోజుల్లోనే ఈ చిన్న పనిని పూర్తి చేసుకోండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+