ఆర్థిక సర్వే: 13 ఏళ్లలో వెజిటేరియన్-నాన్‌వెజిటేరియన్ కొనుగోలు శక్తి ఎంత పెరిగిందంటే?
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఎకనమిక్ సర్వే (ఆర్థిక సర్వే)ను లోకసభలో ప్రవేశ పెట్టారు. ఈ సర్వే ద్వారా సామాన్యుడికి అర్ధశాస్త్రాన్ని అన్వయించేందుకు తాలినామిక్స్ పేరును తెచ్చారు. ఈ సందర్భంగా వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కొనుగోలు శక్తి ఏ మేరకు పెరిగిందనే అంశాన్ని వెల్లడించింది.

వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కొనుగోలు శక్తి..
భారత దేశంలో ఎక్కువచోట్ల భోజనాన్ని థాలి అంటుంటారు. థాలి రేట్ల ఆధారంగా ఆర్థిక రంగంలో నెలకొన్న ఒడిదుడుకులపై కేంద్రం ఓ అంచనాకు వచ్చింది. 2006-07 నుంచి 2019-20 మధ్య వెజిటేరియన్ థాలి రేటులో 29 శాతం పెరుగుదల, నాన్ వెజిటేరియన్ థాలిలో 18 శాతం పెరుగుదల నమోదయినట్లు ఈ సర్వే పేర్కొంది.

థాలినామిక్స్
'థాలినామిక్స్: ది ఎకనమిక్స్ ఆఫ్ ఏ ప్లేట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఇండియా' పేరుతో దీనిని ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా పేర్కొంది. దీని ఆధారంగా పై కొనుగోలు శక్తిని తెలిపింది. 25 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 80 ఇండస్ట్రియల్ వర్కర్స్ ఇండెక్స్ నుంచి ఏప్రిల్ 2006 నుంచి అక్టోబర్ 2019 మధ్య కొనుగోలు వివరాలు తీసుకొని విశ్లేషించారు.

ఏం వడ్డిస్తారంటే
ఈ సర్వే ప్రకారం వెజిటేరియన్ థాలిలో తృణధాన్యాలు, సబ్జీ, పప్పు వడ్డిస్తారు. నాన్ వెజిటేరియన్ థాలీలో తృణధాన్యాలు, సబ్జీ, మాంసాహారం వడ్డిస్తారు.

ధరలు క్రమంగా తగ్గి.. 2019లో పెరిగాయి
భారత్‌లోని నాలుగు ప్రాంతాలు... ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ప్రాంతాల్లో 2015-16 నుంచి వెజిటేరియన్ థాలీ ధరలు క్రమంగా తగ్గాయి. కానీ 2019లో మాత్రం పెరిగాయి.

కొనుగోలు శక్తి
రోజుకు రెండుసార్లు వెజిటేరియన్ థాలీ తీసుకునే ఐదుగురు వ్యక్తులు కలిగిన ఓ కుటుంబం ఏడాదిలో సగటున రూ.10,887 సంపాదిస్తోంది. నాన్ వెజిటేరియన్ కుటుంబం విషయానికి వస్తే ఇది రూ.11,787గా ఉంది. సగటున పారిశ్రామిక కార్మికుడి వార్షిక ఆదాయాన్ని బట్టి చూస్తే 2006-07 నుంచి 2019-20 మధ్య శాఖాహార థాలి కొనుగోలు శక్తి 29 శాతం, మాంసాహార థాలి శక్తి 18 శాతం మెరుగుపడింది.


Click it and Unblock the Notifications