cyber scam: సాంకేతికత విపరీతంగా పెరిగిపోయిన రోజులివి. IT రంగం అభివృద్ధి కారణంగా పెద్దగా కష్టపడకుండానే ఎంచక్కా డబ్బు సంపాదించే మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఏ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగానో వెనకేసుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ అడ్డదారులు తొక్కితేనే చివరకు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
రిషబ్ శర్మ అనే 27 ఏళ్ల వ్యక్తి గతంలో కూరగాయలు అమ్మి జీవనం సాగిస్తూ ఉండేవాడు. కాగా అందుబాటులో ఉన్న సాంకేతికత సహాయంతో ఇప్పుడు పెద్ద సైబర్ స్కామర్ గా మారాడు. కేవలం 6 నెలల్లోనే ఉద్యోగార్థులను మోసం చేస్తూ 21 కోట్లు సంపాదించాడు. వర్క ఫ్రమ్ హోమ్ స్కీమ్స్ పేరిట దేశంలోని 10 రాష్ట్రాల ప్రజలను దగా చేశాడు.

ప్రముఖ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. కరోనా విజృంభింజిన సమయంలో రిషబ్ తీవ్ర నష్టాలపాలయ్యాడు. వాటి నుంచి బయట పడటానికి మోసపూరిత విధానాల వైపు మొగ్గు చూపాడు. ప్రముఖ హోటల్ కు అనుకూలంగా రివ్యూలు రాయాలంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆఫర్ చేసేవాడు. ఈ తప్పుడు దారిలో ఎంతగా ఎదిగాడంటే ఏకంగా 37 చీటింగ్ కేసులలో ప్రధాన నిందితుడిగా మారాడు. 855 స్కామ్స్ లో ఇతడి హస్తం ఉంది.
చైనా, సింగపూర్ వంటి ఇతర దేశాల క్రిమినల్ గ్రూపులతో కలిసి రహస్య పద్ధతుల్లో నగదు ట్రాన్సఫర్ చేసేవాడని నివేదిక పేర్కొంది. తన స్నేహితుడి సాయంతో నకిలీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ.. ఓ టెలిగ్రామ్ గ్రూపు కూడా నిర్వహించినట్లు వెల్లడించింది. అయితే ఎట్టకేలకు అక్టోబరు 28న పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications