ఇప్పటికే రుణాలతో సతమతమవుతున్న మైనింగ్ మేజర్ వేదాంత లిమిటెడ్ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. తాజాగా రిలీజ్ చేసిన Q2 ఫలితాలు పెట్టుబడిదారుల్లో తీవ్ర నిరాశను కలిగించాయి. భారీ నష్టాన్ని నమోదు చేయడంతో కంపెనీ భవిష్యత్తుపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను అనిల్ అగర్వాల్ సారథ్యంలోని వేదాంత లిమిటెడ్ .. 1,783 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఈ మేరకు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో వెల్లడించింది. అయితే కంపెనీ కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం ఏడాది ప్రాతిపదికన (YoY) 6.3 శాతం పెరిగి 38 వేల 945 కోట్లకు చేరుకోవడం గమనార్హం.

గతేడాది ఇదే సమయంలో 1,808 కోట్ల లాభాలను వేదాంత పోస్ట్ చేసింంది. కాగా ఇప్పుడు పూర్తి వ్యతిరేకమైన ఫలితాలను సాధించింది. కొత్త ట్యాక్స్ రేట్ అవలంభించడం కారణంగా నికర పన్ను వ్యయం పెరిగినట్లు తెలుస్తోంది. అయితే స్థూల ఆర్థిక వ్యవస్థ సవాళ్లను తట్టుకోవడానికి వైవిధ్యమైన అసెట్ పోర్ట్‌ఫోలియో, బలమైన బ్యాలెన్స్ షీట్, కాస్ట్ ఆప్టిమైజేషన్ లను ఆచరిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
అన్ని వ్యాపారాల్లోనూ బలమైన వాల్యూమ్ డెలివరీ, ఖర్చుల తగ్గింపు వంటి చర్యలు తీసుకున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ మిశ్రా తెలిపారు. ఫలితంగా ఇప్పటివరకు Q2లో అత్యధికంగా 38 వేల 546 కోట్ల టర్నోవర్, 11 వేల 834 కోట్ల EBITDA నమోదు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఏడాది S&P గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్‌మెంట్ ఇండెక్స్‌లో 5 పాయింట్ల మెరుగుదల సాధించినట్లు గుర్తుచేశారు.


Click it and Unblock the Notifications