Vedanta Q4 Results: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లో రాబడుల సీజన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మైనింగ్ కింగ్ వేదాంత లిమిటెడ్ తన త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.2,634 కోట్లుగా నమోదు చేసింది. గత సంవత్సరం కంపెనీ ఇదే కాలానికి రూ.6,027 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంటే గత ఏడాది కంటే లాభం 56.3 శాతం క్షీణతను నమోదు చేసింది.
ఇదే క్రమంలో నాలుగో త్రైమాసికంలో ఆదాయం మాత్రం స్వల్పంగా 5.4 శాతం మేర తగ్గి రూ.37,225 కోట్లుగా నమోదైంది. ఆపరేటింగ్ ఫ్రంట్‌లో కంపెనీ EBITDA 33.4 శాతం తగ్గి రూ. 8,754 కోట్లకు చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉచిత నగదు ప్రవాహాన్ని (ప్రీ-క్యాపెక్స్) రూ.28,068 కోట్లను అందించింది. ఇది వ్యాపార వృద్దికి తిరిగి పెట్టుబడి పెట్టడంతోపాటు మా విలువైన వాటాదారులకు ఆకర్షణీయమైన డివిడెండ్‌లను అందించినట్లు వేదాంత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ దుగ్గల్ చెప్పారు.

కంపెనీ 1868 మెగావాట్ల పునరుత్పాదక పవర్ డెలివరీ ఒప్పందాలను ఖరారు చేసుకున్నట్లు సునీల్ వెల్లడించారు. 2050 నాటికి లేదా అంతకంటే ముందుగానే కార్బన్ న్యూట్రల్ గా మారేందుకు ఈ చర్య సహాయంగా నిలుస్తుందన్నారు. సెగ్మెంటల్ పనితీరు విషయానికి వస్తే.. జింక్, సీసం, వెండి ఆదాయం 4 శాతం తగ్గి రూ.8,254 కోట్లకు చేరుకుంది. అలాగే అల్యూమినియం ఆదాయం 19.8 శాతం తగ్గి రూ. 12,396 కోట్లకు చేరుకోగా.. రాగి, ఇనుప ఖనిజం విభాగాలు పుంజుకున్నాయి.


Click it and Unblock the Notifications