Anil Agarwal: పొలిటికల్ పార్టీలకు వేదాంత గ్రూప్ భారీ విరాళం.. గతంలో కంటే అధికంగా..
Anil Agarwal: దేశంలో రాజకీయ పార్టీలకు వ్యాపారులు, వ్యాపార సంస్థలు విరాళాలు ఇవ్వటం ఆనవాయితీగా వస్తూనే ఉంది. అయితే దీనిని కొంత ఆధునీకరించి బాండ్స్ అంటూ కొత్త విధానాన్ని బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో ప్రవేశపెట్టింది.
దేశంలోని ప్రఖ్యాత వ్యాపార సంస్థల్లో ఒకటిగా ఉన్న వేదాంత FY23లో రాజకీయ పార్టీలకు అందించిన విరాళాల గురించి తన స్టాక్ మార్కెట్ ఫైలింగ్ లో వెల్లడించింది. మైనింగ్ కింగ్ అనిల్ అగర్వాల్ ఏకంగా రూ.155 కోట్లను ఎలక్టోరల్ బ్యాండ్స్ కొనుగోలు రూపంలో రాజకీయ పార్టీలకు విరాళంగా అందించారు. ఇది గతంలో కంటే ఎక్కువే.. అలాగే గడచిన ఐదేళ్ల కాలంలో వేదాంత లిమిటెడ్ రాజకీయ పార్టీలకు రూ.457 కోట్లను అధికారికంగా విరాళాల రూపంలో అందించింది.

2018లో మోదీ సర్కార్ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే దీని ముఖ్య ఉద్ధేశ్యం ఏమిటంటే అనామకంగా పార్టీలకు నిధులు సమకూర్చటం. ఫలానా వ్యక్తి లేదా సంస్థ పేరు రాజకీయ పార్టీకి అధికారికంగా తెలియకుండా తంతు జరుగుతుందన్నమాట. దేశంలో ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృత శాఖల ద్వారా ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి, ఎన్‌క్యాష్ చేయడానికి మాత్రమే అధికారం ఉంది.
2018 నుంచి 2022 మధ్య కాలంలో బాండ్స్ రూపంలో వచ్చిన విరాళాల్లో అధిక భాగం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి రూ.5270 కోట్లు సమకూరగా.. ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీకి రూ.964 కోట్లు విరాళంగా అందాయి. ఆ తర్వాతి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.767 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందుకుందని గణాంకాలు చెబుతున్నాయి. FY22లో వేదాంత గ్రూప్ బాండ్స్ రూపంలో రూ.123 కోట్లను విరాళంగా అందించింది.


Click it and Unblock the Notifications