Political Funding: భారీ అప్పులతో వేదాంత లిమిటెడ్ సతమతమవుతోంది. దీంతో డీమెర్జర్, నిధుల సమీకరణ వంటి దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇవి కొంతమేర ఉపశమనం కలిగించినట్లే కనిపిస్తోంది. అయితే ఆ కంపెనీ చేసిన ఓ పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
రాజకీయ పార్టీలకు 200 కోట్లు విరాళం ఇచ్చేందుకు వేదాంత బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకోసం గతేడాది జూన్‌లో అంగీకరించిన 57 కోట్ల పరిమితిని పునరుద్ధరించడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. నేరుగా, ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా మరియు ఎలక్టోరల్ బాండ్‌లకు సబ్‌స్క్రిప్షన్ ద్వారా ఈ వ్యవహారాన్ని పూర్తి చేసేందుకు కంపెనీ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ మరియు వైస్ ఛైర్మన్ నవీన్ అగర్వాల్‌కు అధికారం ఉన్నట్లు వెల్లడించింది.

29వ విడత ఎలక్టోరల్ బాండ్ విక్రయాలను ప్రారంభించేందుకు రెండు రోజుల ముందు అంటే నవంబర్ 4న వేదాంత బోర్డు ఈ తీర్మానాన్ని ఆమోదించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మధ్య నవంబర్ 20న ఎలక్టోరల్ బాండ్ల విక్రయాలు ముగిసినట్లు నివేదిక పేర్కొంది.
రాజకీయ నిధుల్లో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా.. పార్టీలకు ఇచ్చే నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్టోరల్ బాండ్ల పథకం 2018లో నోటిఫై చేయబడింది. ఇలా మొత్తం మీద ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు వేదాంత 457 కోట్లు అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 155 కోట్లను విరాళంగా ఇచ్చింది.


Click it and Unblock the Notifications