ప్రభుత్వ కంపెనీ షేర్లపై వేదాంత ఫోకస్ చేసింది. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రాసెస్‌లో భాగంగా ప్రభుత్వం విక్రయించే కంపెనీలను కొనుగోలు చేయాలని వేదాంత అనుకుంటోంది. రూ. 74 వేల కోట్లను అనిల్ అగర్వాల్ ఇన్వెస్ట్ చేయనున్నారు. లండన్ కంపెనీ సెంట్రికస్ అసెట్ మేనేజ్‌మెంట్‌తో కలిసి వేదాంత రిసోర్సెస్ ఇన్వెస్ట్‌మెంట్స్ జరపనుంది. ప్రభుత్వ కంపెనీలో వాటాలను అమ్మడం ద్వారా రూ. 2.1 లక్షల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం చూస్తున్న సంగతి తెలిసిందే.
భారత్ అల్యూమినియం, హిందుస్తాన్ జింక్ వంటి నష్టాల్లో ఉన్నా ప్రభుత్వ కంపెనీలను కొని వాటిని లాభాల బాట పట్టించారు అనిల్. వేదాంత రిసోర్సెస్ కింద ప్రస్తుతం మెటల్స్, మైనింగ్స్, పవర్ సెక్టార్, గ్యాస్ వంటి సెగ్మెంట్లలో వ్యాపారాలను చేస్తున్నారు. పబ్లిక్ కంపెనీల విలువను అన్‌లాక్ చేస్తే అది దేశంలో ఇండస్ట్రీలైజేషన్‌కు కీలకంగా పనిచేస్తుందని అగర్వాల్‌పేర్కొన్నారు.

వేదాంత లిమిటెడ్‌లో ప్రమోటర్ అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ గురువారం 18.5 కోట్ల షేర్లు కొనుగోలు చేసింది. వేదాంత లిమిటెడ్‌లోని ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,959 కోట్లు వెచ్చించి షేర్లను కంపెనీ కొనుగోలు చేసింది. దీంతో వేదాంత లిమిటెడ్‌లో వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాటా 55.1 శాతానికి పెరిగింది. సెప్టెంబర్ చివరి నాటికి ఈ వాటా 50.13 శాతమే ఉండేది. క్రీపింగ్ ఎక్విజిషన్ ద్వారా ఏడాదీ 5 శాతం వాటా పెంచుకోవడానికి ప్రమోటర్లకు అనుమతి ఉన్న సంగతి తెలిసిందే.
వేదాంత లిమిటెడ్‌ను ఇండియాలోని స్టాక్ ఎక్స్చేంజ్‌ల నుంచి డీ లిస్ట్ చేయాలనే ప్రమోటర్ ప్రపోజల్ కొంత కాలం కిందటే ఫెయిలైంది. షేర్ ఒక్కింటికి రూ. 87.5 చొప్పున చెల్లించి డీ లిస్ట్ చేయాలని అప్పట్లో ప్రయత్నించారు. అవసరమైన షేర్లను ప్రమోటర్లు కొనుగోలు చేయలేకపోయారు. ప్రభుత్వం నుంచి భారత్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ కొనాలని వేదాంత గ్రూప్ ఓనర్ అనిల్ అగర్వాల్ పట్టుదలతో ఉన్నారు. ఈ ఎక్విజిషన్‌కు అవసరమైన డబ్బు సమకూర్చుస్తున్నారు.


Click it and Unblock the Notifications