Anil Agarwal: మైనింగ్ దిగ్గజం వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ సంస్థ రుణాలపై ఇటీవల ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ నెలలో 900 మిలియన్ డాలర్లు రుణాన్ని చెల్లించాల్సి ఉంది. అయితే దీనిపై ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని తోసిపుచ్చారు.

అగర్వాల్ వ్యాఖ్యలు..
తమ కంపెనీకి 1 బిలియన్ డాలర్ల అప్పు చెల్లింపులు వేరుశెనగలతో సమానమని ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. రానున్న ఏడాదికి గ్రూప్ వ్యాపారాల ద్వారా 9 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జిస్తామని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల అదానీ గ్రూప్ పై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత మార్కెట్లో అధిక రుణాలను కలిగి ఉన్న కంపెనీలపై ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే.

రేటింగ్ సంస్థ S&P గ్లోబల్..
అమెరికాకు చెందిన ప్రఖ్యాత రేటింగ్ ఏజెన్సీ S&P గ్లోబల్.. ఇటీవల వేదాంత రిసోర్సెస్ తన ఆర్థిక బాధ్యతలను సెప్టెంబరు తర్వాత తీర్చగల సామర్థ్యం ప్రణాళికాబద్ధమైన 2 బిలియన్ డాలర్ల నిధుల సేకరణ, ఆఫ్రికాలో వేదాంత జింక్ ఆస్తుల ప్రతిపాదిత విక్రయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. అయితే ఈ కామెంట్స్ ఇన్వెస్టర్లతో పాటు మార్కెట్లను కొంత కలవరానికి గురిచేసింది. ఆ తర్వాత స్టాక్ సైతం గత నెలలో 10 శాతం వరకు క్రాష్ అయ్యింది.

రుణాల కోసం చర్చలు..
8-10 శాతం వడ్డీ రేటుతో 1 బిలియన్ డాలర్ల రుణం కోసం వేదాంత జెపి మోర్గాన్, ఇతర బ్యాంకులతో చర్చలు జరుపుతోందని మైనింగ్ దిగ్గజం చెప్పారు. వేదాంత గ్రూప్ 13 బిలియన్ డాలర్ల కంటే తక్కువ రుణాలను కలిగి ఉంది. అయితే రానున్న కాలంలో అప్పులు లేని కంపెనీగా మారాలనుకోవటం సాధించగల లక్ష్యమని అనిల్ అగర్వాల్ తెలిపారు. లండన్ ప్రధాన కార్యాలయంగా కంపెనీ తన వ్యాపారాలను నిర్వహిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications