vedanta: ఇన్వెస్టర్లకు వేదాంత గ్రూపు శుభవార్త చెప్పింది. FY23కి గాను తన వాటాదారులకు ఐదవ మధ్యంతర డివిడెండ్ చెల్లింపును బోర్డు ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.20.50 చెల్లించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం దాదాపు రూ.7,621 కోట్లను ఖర్చు చేయనుంది. డివిడెండ్‌కు కంపెనీ ఆమోదం తెలిపే ముందు షేరు 1.50 శాతం లాభంతో కొనసాగుతోంది. అయితే గతేడాదిగా స్టాక్ ద్వారా రాబడి దాదాపు 33 శాతం పడిపోగా, YTD పనితీరు 12.84 శాతం తగ్గడం గమనార్హం.
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను పేస్ వాల్యూ రూ.1 పై 2,050 శాతాన్ని (రూ.20.50) మధ్యంతర డివిడెండ్ ఆమోదించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వేదాంత తెలిపింది. ఇందుకు రికార్డు తేదీని ఏప్రిల్ 7 గా నిర్ణయించినట్లు చెప్పింది. అయితే సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) అజయ్ గోయెల్ తన పదవికి రాజీనామా చేశారని ప్రకటించింది. అది ఏప్రిల్ 9, 2023 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది.

గత ఏడాది కాలంగా రూ.81 డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఫలితంగా ఈ స్టాక్ నుంచి దాదాపు 30 శాతం భారీ డివిడెండ్ రాబడి వచ్చినట్లయింది. అయితే రుణ మెచ్యూరిటీలు సమీపిస్తుండగా, వేదాంత రిసోర్సెస్ చెల్లింపు సామర్థ్యంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో డివిడెండ్ ప్రకటించి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కలిగించక మానదు. వేదాంత లిమిటెడ్‌లో అనిల్ అగర్వాల్‌కి చెందిన వేదాంత రిసోర్సెస్‌కు 70 శాతం వాటా ఉంది.
డిసెంబరు త్రైమాసికంలో వేదాంత ఏకీకృత నికర లాభం 42 శాతానికి అంటే రూ.3,092 కోట్లకు పడిపోయింది. నిర్వహణ ఆదాయాన్ని రూ.33,691 కోట్లుగా కంపెనీ నివేదించింది. ఆ సమయానికి సంస్థ వద్ద రూ.23,474 కోట్లు విలువైన నగదు ఉంది. మే 2022లో మొదటి మధ్యంతర డివిడెండ్ రూ.31.50, రెండవ మధ్యంతర నగదు డివిడెండ్ రూ.19.50ని జూలైలో జారీ చేసింది. గతేడాది నవంబర్, ఫిబ్రవరి 2023లో ప్రకటించిన మూడవ, నాల్గవ ఈక్విటీ డివిడెండ్‌లు ఒక్కో షేరుకు రూ.17.50 మరియు రూ.12.50 చొప్పున చెల్లించింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications