Vedanta: వేదాంత లిమిటెడ్ తన సెమీకండక్టర్ వ్యాపారానికి సలహాదారుగా టెర్రీ డాలీని నియమించినట్లు ప్రకటించింది. దేశంలో అత్యాధునిక సెమీకండక్టర్ ఫ్యాబ్ యూనిట్, సెమీకండక్టర్ అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి వ్యూహాత్మక సలహాలు, ఇన్‌పుట్‌లను అందించేందుకు ఈ నియామకం దోహదపడనుంది.
టెర్రీ డాలీ నియామకంపై వేదాంత-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్స్ లిమిటెడ్ (VFSL) CEO డేవిడ్ రీడ్ సంతోషం వ్యక్తం చేశారు. శామ్‌సంగ్‌తో అధునాతన సాంకేతికతపై వ్యూహాత్మక కూటమిని స్థాపించడంలో, IBM మైక్రోఎలక్ట్రానిక్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడంలో టెర్రీ కీలక పాత్ర పోషించారు. డాలీ IBMలో 26 సంవత్సరాల పాటు పనిచేశారు. ఈ క్రమంలో కంపెనీలో అనేక హోదాల్లో సేవలు అందించారు.

ఐబీఎం కంపెనీలో చేరటానికి ముందు టెర్రీ అమెరికా ఆర్మీలో అధికారిగా ఐదు సంవత్సరాల పాటు సేవలు అందించారు. ఆయన వెస్ట్ పాయింట్‌లోని US మిలిటరీ అకాడమీ నుంచి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీతో గ్రాడ్యుయేట్, ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లొమసీ, టఫ్ట్స్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ సంబంధాలలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు.
సెమీకండక్టర్ పరిశ్రమ నుంచి నాయకులను ఆకర్షించడానికి వేదాంత ప్రపంచవ్యాప్తంగా దూకుడుగా టాలెంట్ అక్విజిషన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. VFSL ఫిబ్రవరిలో పరిశ్రమ అనుభవజ్ఞుడైన డేవిడ్ రీడ్‌ను CEOగా నియమించింది. ఏప్రిల్‌లో సీనియర్ డైరెక్టర్ హ్యూమన్ రిసోర్సెస్‌గా లారెన్స్ (వాంగ్ చీ యోంగ్)ని స్వాగతించింది.


Click it and Unblock the Notifications