Bonus Multibagger: డబ్బును పదిరెట్లు చేసిన బోనస్ మల్టీబ్యాగర్.. సమ్మర్ సూపర్ సేల్స్..
Bonus Multibagger: ఏ కంపెనీలోనైనా పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొనసాగిస్తే ఇన్వెస్టర్లకు అనేక రూపాల్లో రివార్డ్స్ పొందుతారు. బోనస్ షేర్లు, డివిడెండ్, ఎక్కువ ధరలకు షేర్ల బైబ్యాక్ వంటి అనేక మార్గాల్లో పెట్టుబడిదారులకు ప్రయోజనాలు అందుతూనే ఉంటాయి.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఐపీవోగా మార్కెట్లోకి వచ్చి మంచి రాబడులను అందిస్తున్న వరుణ్ బివరేజెస్ స్టాక్ గురించే. 2016లో ఈ స్టాక్ మార్కెట్లో ఒక్కో షేర్ రూ.440-445 ధరకు లిస్ట్ అయ్యింది. అప్పట్లో కంపెనీలో ఒక్క లాట్ షేర్లను రూ.14,685 వెచ్చించి కొనుగోలు చేసిన వారు 10 రెట్లు రాబడిని అందించింది.

ఐపీవోగా మార్కెట్లోకి వచ్చిన బివరేజ్ తయారీ సంస్థ ఇప్పటి వరకు మూడు సార్లు తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను అందించింది. ఈ లెక్కన ఐపీవో సమయంలో కేవలం ఒక్క లాట్ కొనుగోలుతో 33 షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లు మూడు విడతల్లో 76 షేర్లను బోనస్ రూపంలో పొందారు. అంటే మెుత్తం షేర్ల సంఖ్య సదరు ఇన్వెస్టర్ దగ్గర 109కి చేరుకుంది. అంటే అధనంగా ఐపీవోలో పెట్టుబడి పెట్టిన తర్వాత పెట్టుబడిదారులు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే 10 రెట్లు రాబడిని పొందేందుకు బోనస్ షేర్లు దోహదపడ్డాయి.

మల్టీబ్యాగర్ రాబడులను అందించిన వరుణ్ బివరేజెస్ స్టాక్ ధర ఈరోజు మార్కెట్లో రూ.1,458.50 వద్ద ఉంది. ఈ లెక్కన ఎవరైనా ఇన్వెస్టర్ ఐపీవోలో 33 షేర్లను పొందటానికి రూ.14,685 పెట్టుబడిగా.. అవి 109 షేర్లుగా మారాయి. ఈ మెుత్తం షేర్ల మార్కెట్ ధరను పరిగణలోకి తీసుకుంటే రూ.1.59 లక్షలకు చేరుకుని కనకవర్షం కురిపించింది. ఇక్కడ ఇన్వెస్టర్లు క్యాపిటల్ అప్రీసియేషన్ తో పాటు బోనస్ షేర్ల రూపంలో కూడా రాబడిని పొందారు. అమెరికా బయట పెప్సీ శీతలపానీయాల బాటిలింగ్ దిగ్గజ సంస్థగా వరుణ్ బివరేజెస్ కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications