డబ్బులు సంపాదించడమే కాదు.. వాటిని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో కూడా తెలియాలి..!
డబ్బులు అందరు సంపాదిస్తారు. కానీ వాటిని సరైన మార్గంలో పెట్టుబడి పెడితే మరింత లాభం పొందుతారు. ముఖ్యంగా చాలా మందికి సొంతిల్లు, పిల్లలను బాగా చదివించాలని, వృద్ధాప్యంలో హాయ్ జీవించాలని ఉంటుంది. అలాంటి కచ్చితమైన పెట్టుబడి ప్రణాళికతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. అయితే చాలా మందికి ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియదు. అలాంటి వారు నిపుణులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలా సాధ్యం కాని వారికి పలు సంస్థలు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వెబ్ సైట్లు, యాప్స్ తీసుకొచ్చాయి. తాజాగా వెల్త్‌డోర్ గ్రూప్‌కు చెందిన నెస్ట్‌వెస్ట్ యాప్ ను లాంచ్ చేసింది. తమ పిల్లల కోసం ఆర్థిక భద్రతను నిర్మించడంలో తల్లిదండ్రులకు సహాయపడటానికి జీరో కమీషన్‌తో నెస్ట్‌వెస్ట్ ఒకే వార్షిక సలహా రుసుముతో టైర్ 2, టైర్ 3 నగరాల్లో తమ సేవలను ప్రారంభించినట్లు పేర్కొంది.
వెల్త్‌డోర్ ప్రపంచవ్యాప్త ఆర్థిక నైపుణ్యం ఆధారంగా నిర్మించిన నెస్ట్‌వెస్ట్, వ్యక్తిగతీకరించిన పోర్ట్‌ఫోలియోలు, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్‌లు, ఆటోమేటెడ్ కాంట్రిబ్యూషన్‌లు, లక్ష్యాల వారీగా ట్రాకింగ్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల విద్య, వివాహాలు, మొదటి ఇల్లు, ఇతర ముఖ్యమైన పను కోసం ప్రణాళిక వేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి నిర్దిష్ట లక్ష్యం కోసం ఆ లక్ష్యం కాలపరిమితి, తల్లిదండ్రుల రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా తమ యాప్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ప్లాన్‌ల, వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియోను సిఫార్సు చేస్తుందని ప్రకటించింది. తమ కంపెనీ పండగ సందర్బంగా సంవత్సరానికి రూ.29 నుంచి ప్రారంభమయ్యే తొలి అడ్వైజరీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ప్రవేశపెట్టిందని వివరించింది.

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఒక మంచి భవిష్యత్తును కలలు కంటారని వెల్త్‌డోర్. నెస్ట్‌వెస్ట్ వ్యవస్థాపకులు కునాల్ ఆనంద్ చెప్పారు. కానీ ఆ కలలు నిజం కావడానికి ఆర్థిక ప్రణాళిక, క్రమశిక్షణ, చక్రవడ్డీ శక్తి అవసరమని పేర్కొన్నారు. వృత్తిపరమైన సంపద నిర్వహణ అనేది కేవలం ధనిక కుటుంబాలకే పరిమితమైన హక్కుగా ఉండకూడదని తాము నమ్ముతున్నట్లు వివరించారు. ప్రతి భారతీయ తల్లిదండ్రుల కోసం రూపొందించన నెస్ట్‌వెస్ట్ ద్వారా,భారతదేశం స్వీయ-పెట్టుబడి నుంచి లక్ష్య-ఆధారిత, సలహాలతో కూడిన పెట్టుబడి వైపు పయనించడంలో సహాయపడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మార్కెట్ లో నెస్ట్ వెస్ట్ కాకుండా చాలా రకాల ఆర్థికపరమైన సలహాలు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. అయితే అవి సెబీ రిజిస్ట్రర్డ్ కంపెనీలా కాదా అని తెలుసుకుని సలహాలు తీసుకోవడం మంచిది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications