Post Office Schemes: చిన్న మొత్తంలో పొదుపు చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ పథకాలు మీ కోసమే..!
తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు.. చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పోస్టాఫీస్ పథకాలు చక్కని ఎంపిక అవుతాయి. ఈ పోస్టాఫీస్ పథకాలు సురక్షితమైనవి అలాగే ఆకర్షణీయమైన రాబడితో ఉంటుంది. ఏ పోస్టాఫీస్ పథకంలో ఎంత వడ్డీ వస్తుందో తెలుసుకుందాం..

పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా
ఈ పథకంలో కనీసం రూ. 500 డిపాజిట్‌తో పొదుపు ఖాతా. వడ్డీ రేటు సంవత్సరానికి 4 శాతం.

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్
1 నుంచి 5 సంవత్సరాల వరకు వివిధ కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం ఇది. కాలవ్యవధిని బట్టి వడ్డీ రేటు సంవత్సరానికి 5.5 శాతం నుంచి 6.7 శాతం వరకు ఉంటుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
15 సంవత్సరాల కాలవ్యవధితో దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. వడ్డీ రేటు ప్రస్తుతం సంవత్సరానికి 7.1 శాతం ఉంటుంది. కనీస పెట్టుబడి సంవత్సరానికి రూ. 500.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)
5 సంవత్సరాల కాలవ్యవధితో స్థిర-ఆదాయ పెట్టుబడి పథకం. ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 6.8 శాతంగా ఉంది.

కిసాన్ వికాస్ పత్ర (KVP)
124 నెలల్లో (10 సంవత్సరాల 4 నెలలు) మీ పెట్టుబడిని రెట్టింపు చేసే పొదుపు పథకం. ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది. ఇది రైతులకు మాత్రమే.

సుకన్య సమృద్ధి యోజన (SSY)
21 సంవత్సరాల కాలవ్యవధి ఉన్న బాలికల కోసం పొదుపు పథకం. వడ్డీ రేటు ప్రస్తుతం సంవత్సరానికి 7.6 శాతంగా ఉంది. కనీస పెట్టుబడి మొత్తం సంవత్సరానికి రూ. 250.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)
ఇది 5 సంవత్సరాల కాలవ్యవధితో సీనియర్ సిటిజన్లకు పొదుపు పథకం. ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications