Gold Loans: బంగారంపై తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
ఈ మధ్య కాలంలో బంగారం రుణాలు తీసుకునేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం పసిడి ధర భారీగా పెరగడం. అంతేకాకుండా.. వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉండడమని నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారు రుణాలకు సంబంధించి రీ పేమెంట్ గడువు చాలా తక్కువగా ఉంటుంది. సంవత్సరంలోనే పసిడి రుణాలను రెన్యూవెల్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. వివిధ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో బంగారం రుణాలకు ఎంత వడ్డీ వసూలు చేస్తున్నారో తెలుసుకుందాం..!

బ్యాంకు బజార్ ప్రకారం..యాక్సెస్ బ్యాంక్ బంగారం రుణాలపై 9.5 శాతం నుంచి 17 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తోంది. ఈ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని బట్టి రూ..50,001 నుంచి రూ.40 లక్షల వరకు బంగారం రుణాలు అందిస్తున్నారు. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు 9.10 శాతం నుంచి వడ్డీ వసూలు చేస్తోంది. గరిష్టంగా ఎంతో పేర్కొనలేదు. కెనరా బ్యాంక్ గోల్డ్ లోన్ పై 8.80 శాతం నుంచి వడ్డీ కలెక్ట్ చేస్తోంది.
ముత్తూట్ లో బంగారం రుణాలపై 24 శాతం నుంచి 30 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. వీరు కనీసం రూ.1000 నుంచి రుణాలు ఇస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్ట్ రుణాలపై సంవత్సరానికి
8.65 శాతం నుంచి 8.95 శాతం వడ్డీ తీసుకుంటోంది.
స్టేట్ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని బట్టి రూ.20,000 నుంచి రూ.50 లక్షల వరకు లోన్ ఇస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంకు బంగారం రుణాలపై 10.56 శాతం నుంచి వడ్డీ వసూలు చేస్తోంది. ఈ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని బట్టి రూ.20,000 నుంచి రూ..1.5 రుణం ఇస్తోంది. ఇండస్ ఇండ్ బ్యాంక్ గోల్డ్ లోన్ పై 10.06 శాతం నుంచి 15.50 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. ఈ బ్యాంక్ బంగారంపై రూ.20 లక్షల వరకు లోన్ ఇస్తున్నారు. మనుప్పురం బంగారం రుణాలపై 9.90 శాతం వడ్డీ రేటు కలెక్ట్ చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గోల్డ్ లోన్ పై 8.50 శాతం నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారు. ఈ బ్యాంకు బంగారం తాకట్టుపై రూ.20,000 నుంచి రూ.1 కోట్ల వరకు రుణాలు ఇస్తున్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ గోల్డ్ రుణాలపై 8.50 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా బంగారం రుణాలపై 9.00 శాతం నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారు. ఈ బ్యాంకు బంగారంపై గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు రుణం ఇస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications