100 స్మార్ట్ సిటీలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. స్మార్ట్ సిటీ అభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి టాప్ 20లో నిలిచింది. కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ 20 బెస్ట్ పర్ఫార్మింగ్ నగరాలు, 20 బాటమ్ నగరాలను జత చేసి, రెండూ కలిసి పని చేయనున్నాయి. ఈ నగరాలు సిస్టర్ సిటీలుగా పని చేస్తాయి.

టాప్ 20లో వారణాసి, విశాఖ, అమరావతి
ఇక, టాప్ 20 బెస్ట్ నగరాల విషయానికి వస్తే అహ్మదాబాద్ (ఫస్ట్ ర్యాంక్), నాగపూర్, తిరుప్పూర్, రాంచీ, భోపాల్, సూరత్, కాన్పూర్, ఇండోర్, విశాఖపట్నం, వెల్లూర్, వడోదర, నాషిక్, ఆగ్రా, వారణాసి, దేవణగెరె, కోట, పుణే, ఉదయ్‌పూర్, డెహ్రాడూన్, అమరావతి ఉన్నాయి.

20-20 ఫార్ములా
సిస్టర్ సిటీల్లో భాగంగా 20-20 ఫార్ములా ప్రకారం రాంచీ, పుణే నగరాలకు షిమ్లా, ధర్మశాల తోడవుతున్నాయి. టాప్ 20 బెస్ట్ సిటీలు, బాటమ్‌లోని 20 నగరాలు ఫిబ్రవరి 20వ తేదీలోపు ఒప్పందం కుదుర్చుకుంటాయి. వివిధ కోణాల్లో నగరాలను జత చేశారు.

డయ్యూ కోసం విశాఖపట్నం
వారణాసి నగరాన్ని అమృత్‌సర్‌తో జత చేశారు. డయ్యూ నగర అభివృద్ధి కోసం విశాఖపట్నం, షరాన్‌పూర్ కోసం సూరత్ కలిసి పని చేయనుంది. మిజోరామ్ రాజధాని ఐజ్వాల్‌తో కలిసి భోపాల్ పని చేస్తుంది. 100 స్మార్ట్ సిటీలకు సంబంధించి రూ.2,05,018 కోట్ల విలువైన 5151 ప్రాజెక్టులను గుర్తించారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications