భారతీయ రైల్వే రంగంలో మరో విప్లవం రాబోతోంది. ఇప్పటికే పగటిపూట ప్రయాణాలకు వన్నె తెచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఇప్పుడు రాత్రి ప్రయాణాల కోసం 'స్లీపర్' వెర్షన్‌లో సిద్ధమైంది. ఈ నెలలోనే ప్రారంభం కానున్న వందే భారత్ (vande bharat) స్లీపర్ రైలు ధరలు, రూట్, ప్రత్యేకతల గురించి ఇప్పుడు చూద్దాం.

రైల్వే ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ (vande bharat) స్లీపర్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. జనవరి 2026 ద్వితీయార్థంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అత్యాధునిక రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం విమాన స్థాయి సౌకర్యాలతో ఈ రైలును రూపొందించారు.
తొలి ప్రయాణం ఎక్కడ నుంచి ఎక్కడికి?
మొట్ట మొదటి వందే భారత్ స్లీపర్ సర్వీస్ గౌహతి, కోల్‌కతా (హౌరా) నగరాల మధ్య నడవనుంది. ఇది సుమారు 1,200 నుండి 1,500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ మార్గంలో పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, హుగ్లీ, ముర్షిదాబాద్, అస్సాంలోని బొంగైగావ్ వంటి కీలక జిల్లాల ప్రజలకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతోంది.
టికెట్ ధరల వివరాలు (Ticket Fares)
సాధారణ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే దీని ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇచ్చే సౌకర్యాలు మాత్రం అద్భుతం. గౌహతి - కోల్‌కతా రూట్ కోసం ప్రాథమికంగా నిర్ణయించిన ధరలు ఇవే..
- AC 3-Tier: రూ.2,300 (వన్ వే ప్రయాణానికి)
- AC 2-Tier: రూ. 3,000
- AC First Class: రూ. 3,600
రైలు ప్రత్యేకతలు ఏంటి?
ఈ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. ఇందులో 11 ఏసీ 3-టైర్, 4 ఏసీ 2-టైర్, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఉంటాయి. మొత్తం 823 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు.
- వేగం: కోటా-నాగ్దా సెక్షన్‌లో జరిగిన ట్రయల్ రన్స్‌లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది.
- స్టెబిలిటీ: 180 కి.మీ వేగంతో వెళ్తున్నప్పుడు కూడా రైలులో నీటి గ్లాసు పెడితే అందులోని నీరు కూడా తొణకకుండా ఉండటం దీని ప్రత్యేకత.
- సౌకర్యాలు: ఎర్గోనామిక్ సీట్లు, రీడింగ్ లైట్లు, సెన్సార్ ఆధారిత వాష్‌రూమ్‌లు, అత్యాధునిక ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఇందులో ఉన్నాయి.
భవిష్యత్తు ప్రణాళికలు
మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే ఆరు నెలల్లో మరో 8 స్లీపర్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 12 స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. త్వరలోనే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే హైదరాబాద్ - బెంగళూరు, విజయవాడ - చెన్నై వంటి రూట్లలో కూడా వందే భారత్ (vande bharat) స్లీపర్ రైళ్లు వచ్చే అవకాశం ఉంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications