vande bharat sleeper: వందే భారత్ స్లీపర్ రెడీ! టికెట్ ధరలు, రూట్ మ్యాప్, పూర్తి వివరాలు ఇవే..
భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చేసిన 'వందే భారత్' ఇప్పుడు మరో కొత్త అవతారంలో మన ముందుకు వచ్చింది. ఇప్పటివరకు కేవలం కూర్చుని ప్రయాణించే (Chair Car) సదుపాయం మాత్రమే ఉండగా.. ఇప్పుడు సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం వందే భారత్ స్లీపర్ (vande bharat sleeper) రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. శనివారం (జనవరి 17, 2026) పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా టౌన్ వేదికగా దేశంలోనే మొట్ట మొదటి స్లీపర్ వందే భారత్ కు ఆయన పచ్చజెండా ఊపారు.

ఈ రైలు పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుండి అస్సాంలోని కామాఖ్య (గువాహతి) మధ్య నడవనుంది. ఈ ఆధునిక రైలు అందుబాటులోకి రావడం వల్ల దాదాపు 2.5 నుండి 3 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
విమానం రేంజ్ లో అదిరిపోయే ఫీచర్లు!
వందే భారత్ స్లీపర్ రైలును కేవలం ప్రయాణం కోసం మాత్రమే కాకుండా, ఒక లగ్జరీ అనుభూతిని ఇచ్చేలా రూపొందించారు. దీనిలోని ప్రధాన ఫీచర్లు ఇవే..
- వేగం: ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. అయితే భద్రతా దృష్ట్యా ప్రస్తుతం 120-130 కి.మీ వేగంతో నడుపుతున్నారు.
- హైజీన్ & సేఫ్టీ: రైలులో 99% క్రిములను చంపేసే 'డిసిన్ఫెక్టెంట్ టెక్నాలజీ'ని ఉపయోగించారు. అలాగే ప్రమాదాలను నివారించేందుకు దేశీయంగా తయారైన 'కవచ్' (Kavach) భద్రతా వ్యవస్థను అమర్చారు.
- ఆటోమేషన్: స్టేషన్ వస్తే తప్ప తలుపులు తీరుకోవు. ప్రయాణమంతా ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు మూసి ఉంటాయి.
- కంఫర్ట్: బెర్త్‌ల డిజైన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కుదుపులు లేని ప్రయాణం కోసం వరల్డ్ క్లాస్ సస్పెన్షన్ సిస్టమ్ ను ఉపయోగించారు.
నోరూరించే స్థానిక రుచులు!
ఈ రైలులో ప్రయాణించే వారికి మరో స్పెషల్ సర్ప్రైజ్ ఏంటంటే.. ఫుడ్! మీరు విమానాల్లో లాగా ఇక్కడ లోకల్ ఫుడ్ ని ఆస్వాదించవచ్చు.
- కామాఖ్య నుండి హౌరా వెళ్లే ప్రయాణికులకు అస్సామీ వంటకాలు వడ్డిస్తారు.
- హౌరా నుండి కామాఖ్య వెళ్లే వారికి రుచికరమైన బెంగాలీ భోజనం లభిస్తుంది. ఈ కేటరింగ్ ఛార్జీలు టికెట్ ధరలోనే కలిసి ఉంటాయి.
టికెట్ ధరలు ఎలా ఉన్నాయి?
వందే భారత్ స్లీపర్ రైలులో మూడు రకాల ఏసీ తరగతులు ఉన్నాయి. వాటి అంచనా ధరలు ఇలా ఉన్నాయి..
- 3AC (Third AC) ఒకవైపు ప్రయాణానికి సుమారు రూ. 2,300., 2AC (Second AC) టికెట్ ధర రూ.3,000., 1AC (First AC) ధర రూ. 3,640..
నో వెయిటింగ్ లిస్ట్!
సాధారణ రైళ్లలో లాగా ఇందులో RAC లేదా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉండవు. కేవలం కన్ఫర్మ్ అయిన టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. దీనివల్ల రైలు లోపల రద్దీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది.
మొత్తంగా ఈ ఫస్ట్ వందే భారత్ (vande bharat sleeper) రైలు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచడమే కాకుండా టూరిజం అభివృద్ధికి కూడా ఈ రైలు ఎంతో దోహదపడుతుంది. త్వరలోనే దేశంలోని ఇతర నగరాల మధ్య (ముఖ్యంగా ఢిల్లీ-పాట్నా, ముంబై-ఢిల్లీ) కూడా ఇవి అందుబాటులోకి రానున్నాయి.


Click it and Unblock the Notifications


