భారతీయ రైల్వేలు స్పీడ్ పెంచుతున్నాయి! ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కడానికి ముహూర్తం ఖరారైంది. ఇప్పటివరకు మనకు అందుబాటులో ఉన్న వందే భారత్ రైళ్లు కేవలం కూర్చునే సదుపాయం (Chair Car) మాత్రమే ఉండేవి. కానీ, ఇకపై సుదూర ప్రయాణాలను కూడా హాయిగా పడుకుని పూర్తి చేసేలా అత్యాధునిక స్లీపర్ కోచ్‌లను ప్రభుత్వం సిద్ధం చేసింది.

ఎప్పుడు ప్రారంభం? ఎక్కడ మొదలవుతుంది?
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ రైలుకు సంబంధించిన అన్ని రకాల భద్రతా పరీక్షలు పూర్తయ్యాయి. జనవరి 17, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ స్లీపర్ (Vande Bharat Sleeper) రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.
తొలి విడతగా ఈ రైలు పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుండి అస్సాంలోని గువాహతి (కామాఖ్య) మధ్య నడవనుంది. జనవరి 18 నుండి సామాన్య ప్రయాణికులకు ఈ సర్వీసు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
టికెట్ ధరలు ఎలా ఉన్నాయి?
చాలామంది ప్రయాణికులు వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) టికెట్ ధరలు ఎంత ఉంటాయో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైల్వే బోర్డు నిర్ణయించిన దాని ప్రకారం, ఈ రైలు ఛార్జీలు కిలోమీటర్ల ప్రాతిపదికన ఉంటాయి.
- కనీస ఛార్జీ: మీరు కనీసం 400 కిలోమీటర్ల దూరానికి టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
- 3rd AC: కిలోమీటరుకు రూ. 2.4 (కనీస ధర రూ. 960)
- 2nd AC: కిలోమీటరుకు రూ. 3.1 (కనీస ధర రూ. 1,240)
- 1st AC: కిలోమీటరుకు రూ. 3.8 (కనీస ధర రూ. 1,520)
హౌరా నుండి గువాహతి వరకు పూర్తి ప్రయాణానికి (కేటరింగ్ ఛార్జీలతో కలిపి) థర్డ్ ఏసీకి సుమారు రూ. 2,300, సెకండ్ ఏసీకి రూ. 3,000, ఫస్ట్ ఏసీకి రూ. 3,600 వరకు ఉండవచ్చు. వీటికి అదనంగా జీఎస్టీ ఛార్జీలు వర్తిస్తాయి.
నో వెయిటింగ్ లిస్ట్.. నో ఆర్‌ఏసీ!
రైల్వే బోర్డు ఈ రైలు విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు అత్యుత్తమ సౌకర్యం అందించే ఉద్దేశంతో వందే భారత్ స్లీపర్ లో కేవలం 'కన్ఫర్మ్' అయిన టికెట్లను మాత్రమే అనుమతిస్తారు. అంటే సాధారణ రైళ్లలా ఇందులో ఆర్‌ఏసీ (RAC) లేదా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణీకులు ఉండరు. దీనివల్ల ప్రయాణికులకు ఇరుకుగా అనిపించదు, ప్రశాంతంగా ప్రయాణించవచ్చు.
రిజర్వేషన్ కోటాలు..
ఈ రైలులో అన్ని రకాల కోటాలు ఉండవు. కేవలం కింద పేర్కొన్న ముఖ్యమైన విభాగాలకు మాత్రమే రిజర్వేషన్ వెసులుబాటు ఉంటుంది:
- మహిళలు
- దివ్యాంగులు
- సీనియర్ సిటిజన్లు
- రైల్వే సిబ్బంది (డ్యూటీ పాస్ కోటా)
రైలు ప్రత్యేకతలు ఏమిటి?
ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. ఇందులో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. మొత్తం 823 మంది ప్రయాణికులు ప్రయాణించే వీలుంది. గంటకు 160 కి.మీ వేగంతో వెళ్లే ఈ రైలులో 'కవచ్' భద్రతా వ్యవస్థ, ఆటోమేటిక్ డోర్లు, లగ్జరీ బెర్త్‌లు, అధునాతన ఇంటీరియర్స్‌తో విమాన స్థాయి సౌకర్యాలు కల్పించారు.
మొత్తానికి భారతీయ రైల్వే రంగాన్ని ఈ వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైలు మరో స్థాయికి తీసుకువెళ్లబోతోందని చెప్పడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications