రైలు కాదిది.. పట్టాలపై నడిచే లగ్జరీ హోటల్! వందే భారత్ స్లీపర్ ఫస్ట్ లుక్ చూస్తే మైండ్ బ్లాక్!
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న సరికొత్త వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకు మనం కూర్చుని ప్రయాణించే వందే భారత్ ట్రైన్లను మాత్రమే చూశాం. కానీ, రాత్రి వేళల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం సరికొత్తగా డిజైన్ చేసిన వందే భారత్ స్లీపర్ కోచ్ ఫస్ట్ లుక్ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. "ఇది రైలు పెట్టె కాదు బాబోయ్, పట్టాలపై నడిచే ఒక లగ్జరీ బొటిక్ హోటల్ రూమ్" అంటూ కామెంట్లు పెడుతున్నారు.
భారతీయ జనతా పార్టీ (BJP) అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో.. ముంబై - బెంగళూరు రూట్‌లో నడవబోయే ఈ సరికొత్త రైలుకు సంబంధించిన ఫస్ట్ క్లాస్ ఏసీ (First AC) కోచ్‌ను చూపించారు. ఇందులో ఉన్న ప్రీమియం ఇంటీరియర్స్, ప్రైవేట్ క్యాబిన్లు ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్‌లో ఇంటీరియర్స్
సాధారణ ఫస్ట్ ఏసీ కోచ్‌లతో పోలిస్తే ఈ కొత్త వందే భారత్ స్లీపర్ క్లాస్ చాలా డిఫరెంట్‌గా, మోడ్రన్‌గా ఉంది. ఆధునిక లైటింగ్ సిస్టమ్, ప్రీమియం ఫినిషింగ్‌తో కూడిన గోడలు, స్పేస్ చాలా చక్కగా ఉపయోగపడేలా చేసిన లేఅవుట్ ప్రయాణికులకు ఒక సరికొత్త ఫీలింగ్‌ను ఇస్తాయి. 12 నుండి 16 గంటల సుదీర్ఘ ప్రయాణంలో అలసట తెలియకుండా ఉండేందుకు వీలుగా బెర్త్‌లను ఎంతో సౌకర్యవంతంగా (Ergonomic design) తయారు చేశారు.
ఈ రైలులో ఉండే కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఇవే..
• అప్‌గ్రేడ్ చేసిన అత్యాధునిక వాష్‌రూమ్‌లు.
• డిజిటల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే బోర్డులు.
• ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ (CCTV) కెమెరాలు.
• కోచ్ అంతటా సెంట్రలైజ్డ్ ఏసీ , ఆహ్లాదకరమైన లైటింగ్.
ఈ రూట్ ఎందుకు అంత ప్రత్యేకం?
ముంబై - బెంగళూరు రూట్ అనేది భారతదేశంలోనే అత్యంత బిజీగా ఉండే కారిడార్లలో ఒకటి. వ్యాపారవేత్తలు, ఐటీ ఉద్యోగులు, స్టూడెంట్స్ ఈ రూట్‌లో నిరంతరం ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం చాలా మంది సమయం ఆదా అవుతుందని ఫ్లైట్ జర్నీని ఎంచుకుంటున్నారు. కానీ ఎయిర్‌పోర్టుకు వెళ్లడం, లగేజీ పరిమితులు, సెక్యూరిటీ చెకింగ్ వంటి తలనొప్పులు లేకుండా.. తక్కువ ఖర్చుతో ప్రశాంతంగా పడుకుని ప్రయాణించాలనుకునే వారికి ఈ వందే భారత్ స్లీపర్ బెస్ట్ ఆప్షన్‌గా మారబోతోంది.
సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం!
ఈ లగ్జరీ కోచ్ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. "చూడటానికి చాలా అద్భుతంగా ఉంది.. కానీ మన జనాలు దీనిని ఇంతే క్లీన్‌గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది" అని ఒకరు అనగా.. "మా మంగళూరు రూట్‌కి కూడా ఇలాంటి ట్రైన్ ఒకటి వేయండి సార్" అని మరొకరు కోరారు. ఏదేమైనా ఈ సరికొత్త స్లీపర్ ట్రైన్ భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications