ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వచ్చే రెండు నెలల్లో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు!

భారతీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vandebharat) ప్రయాణికులకు మరో అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న వందే భారత్ రైళ్లలో కేవలం కూర్చునే సదుపాయం (Chair Car) మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'వందే భారత్ స్లీపర్ క్లాస్' (Vande Bharat Sleeper Class) రైళ్ల ట్రయల్ రన్ మరో రెండు నెలల్లో ప్రారంభం కానుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు.

Vande Bharat Sleeper Class Train Trial Run To Start In Two Months Indian Railways

ప్రజల డిమాండ్ మేరకే స్లీపర్ కోచ్‌లు!

దేశీయంగా తయారు చేయబడిన మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైలు అయిన వందే భారత్‌కు ప్యాసింజర్ల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే రాత్రి వేళల్లో , ఎక్కువ దూరం ప్రయాణించేలా స్లీపర్ వర్షన్‌ను తీసుకురావాలని ప్రజల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకునే రైల్వే శాఖ ఈ సరికొత్త స్లీపర్ కోచ్‌లను డిజైన్ చేసింది. రాబోయే ఐదేళ్లలో రైల్వే మౌలిక సదుపాయాల (Infrastructure) అభివృద్ధిపై , ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంపైనే ప్రభుత్వం పూర్తి ఫోకస్ పెట్టనుందని మంత్రి తెలిపారు.

గత పదేళ్లలో 35 వేల కిలోమీటర్ల కొత్త ట్రాక్‌లు

రైల్వే నెట్‌వర్క్ విస్తరణ గురించి మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. గత పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఏకంగా 35,000 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్‌లను నిర్మించినట్లు హైలైట్ చేశారు. ఇది భారత రైల్వే చరిత్రలోనే ఒక రికార్డు. కేవలం ప్రీమియం ప్రయాణికులే కాకుండా, తక్కువ ఆదాయ వర్గాల (Low Income Groups) కు కూడా లగ్జరీ , సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే, నాన్-ఏసీ స్లీపర్ , జనరల్ కోచ్‌లతో నడిచే 'అమృత్ భారత్' (Amrit Bharat) రైళ్ల ఉత్పత్తిని కూడా భారీగా పెంచుతున్నట్లు చెప్పారు.

వందే భారత్ స్లీపర్ ప్రత్యేకతలు ఇవే!

రైల్వే వర్గాల సమాచారం ప్రకారం, కొత్తగా రాబోతున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే మెరుగైన వేగంతో, అత్యాధునిక సౌకర్యాలతో ఉండబోతున్నాయి.

  • ఆటోమేటిక్ డోర్లు & సెన్సార్లు: ట్రైన్ పూర్తిగా ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కలిగి ఉంటుంది.
  • జెర్క్-ఫ్రీ జర్నీ: ప్రయాణికులకు ఎలాంటి కుదుపులు (Jerks) తెలియకుండా ప్రత్యేక సస్పెన్షన్ టెక్నాలజీని వాడారు.
  • సరికొత్త ఇంటీరియర్స్: లగ్జరీ బెర్త్‌లు, రీడింగ్ లైట్లు, ప్రతి సీటుకు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు , మోడ్రన్ బయో-టాయిలెట్స్ ఇందులో ఉండనున్నాయి.

సమ్మర్ రద్దీకి రైల్వేస్ పక్కా ప్లాన్

ప్రస్తుత వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి ఇండియన్ రైల్వేస్ రికార్డు స్థాయిలో సేవలు అందించింది. సమ్మర్ సీజన్ స్పెషల్స్ కింద దేశవ్యాప్తంగా సుమారు 20,000 ప్రత్యేక రైళ్లను (Special Trains) నడిపినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా దాదాపు 4 కోట్ల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకున్నారని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వందే భారత్ స్లీపర్ , అమృత్ భారత్ రైళ్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. సాధారణ రోజుల్లో కూడా వెయిటింగ్ లిస్ట్ సమస్య చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+