Vama Industries Stock: స్టాక్ మార్కెట్లలో కొన్ని పెన్నీ స్టాక్స్ చిచ్చర పిడుగుల్లా పెరుగుతూ ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చేస్తున్నాయి. మల్టీబ్యాగర్ రాబడులతో దూసుకుపోతున్న స్టాక్ తన ఇన్వెస్టర్లకు ఏకంగా 1222 శాతం రాబడిని అందించింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇప్పటివరకు 1222% రాబడిని అందించిన 50 పైసల స్టాక్ వామా ఇండస్ట్రీస్ గురించే. పెట్టుబడిదారులను ధనవంతులుగా మార్చిన పెన్నీ స్టాక్ వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో అప్పర్ సర్క్యూట్ తాకుతోంది. నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు ఏకంగా 10 శాతం అప్పర్ సర్క్యూట్‌తో ప్రారంభమైంది. దీంతో కంపెనీ స్టాక్ ధర ఒక్కోటి రూ.6.61 స్థాయికి చేరుకుంది.

వాస్తవానికి వామా ఇండస్ట్రీస్ షేర్లలో వరుస పెరుగుదలకు కారణం కంపెనీ రూ.74.32 కోట్ల విలువైన సప్లయ్ ఆర్డర్ అందుకోవటమేనని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం కంపెనీ షేర్లను విక్రయించేవారు కనిపించటం లేదు. స్టాక్ ధర చరిత్రను పరిశీలిస్తే.. ఫిబ్రవరి 21, 2024న 52 వారాల గరిష్ట స్థాయి రూ.7.2కి చేరుకుంది. గత మూడు రోజుల్లో షేరు ధర దాదాపు 40 శాతం పెరిగింది. అలాగే ఒక నెలలో 26 శాతం, ఆరు నెలల కాలంలో 38 శాతం రాబడిని కంపెనీ షేర్లు తమ కస్టమర్లకు అందించాయి. ఫిబ్రవరి 6, 2004లో కంపెనీ షేర్ ధర ఒక్కోటి 50 పైసలుగా ఉంది.
కంపెనీ న్యూస్‌పేస్ ఇండియా లిమిటెడ్ నుంచి రూ.74.32 కోట్ల విలువైన సప్లై ఆర్డర్‌ని పొందినట్లు వెల్లడించింది. ఆర్డర్‌లో హైరార్కికల్ స్టోరేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టర్న్-కీ ప్రాతిపదికన సెంట్రల్ ఆర్కైవల్ ఫెసిలిటీ సొల్యూషన్ కోసం సర్వర్ల సరఫరాకు ఆర్డర్లు వచ్చాయి. డేటా మైగ్రేషన్‌తో సహా ఇన్‌స్టాలేషన్ అండ్ కమీషనింగ్ 24 వారాల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని ఆర్డర్ ప్రకారం తెలుస్తోంది. అలాగే వీటికి శిక్షణ, వారెంటీ, సపోర్ట్ సేవలు ఇన్‌స్టాలేషన్ పూర్తైన తర్వాత 7 ఏళ్ల వరకు ఉండనున్నాయి.
కంపెనీ వ్యాపారం:
వామా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రధానంగా IT & ITESలో డీల్ చేస్తుంది. ఈ సంస్థ ప్రభుత్వం, ఇండస్ట్రియల్, బిజినెస్ లేదా ఇతర కార్యకలాపాల రంగాల్లో ఉపయోగం కోసం అన్ని రకాల సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ అధ్యయనం, విశ్లేషణ రూపకల్పన, అభివృద్ధి, అమలులో తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications