మన భారతీయులకు బంగారం అంటే ప్రాణం. శుభకార్యాలకైనా, పెట్టుబడికైనా మన మొదటి ఛాయిస్ పసిడి మాత్రమే. అయితే ఇప్పుడు ఈ బంగారం (Gold) గురించి ఒక ఆసక్తికరమైన గణాంకం వెలుగులోకి వచ్చింది. భారతీయ గృహాల వద్ద ఉన్న మొత్తం బంగారం విలువ మన దేశ మొత్తం ఆర్థిక వ్యవస్థ (GDP) పరిమాణం కంటే ఎక్కువగా ఉందట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. పెరిగిన బంగారం ధరల రీత్యా ఇది అక్షరాలా నిజం.

5 ట్రిలియన్ డాలర్ల పసిడి నిధి!
తాజా అంచనాల ప్రకారం.. భారతీయ కుటుంబాల వద్ద సుమారు 30,000 టన్నుల బంగారం ఉంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం చూస్తే, దీని విలువ సుమారు 5 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ. 420 లక్షల కోట్లు). అదే సమయంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) నివేదిక ప్రకారం.. 2025 నాటికి భారతదేశ నామినల్ జీడీపీ 4.125 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అంటే దేశం మొత్తం ఉత్పత్తి చేసే ఆదాయం కంటే.. మన ఇళ్లలో ఉన్న బంగారం విలువే దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల వరకు ఎక్కువగా ఉంది. 2025 సంవత్సరంలోనే బంగారం ధరలు ఏకంగా 65 శాతం పెరగడం ఈ విలువ పెరగడానికి ప్రధాన కారణం.
ధరలు ఎందుకు ఆకాశాన్ని తాకుతున్నాయి?
బంగారం ధరలు ఇంతలా పెరగడానికి అనేక ప్రపంచ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఆర్థిక అనిశ్చితి, డాలర్ విలువ తగ్గడం, ఉక్రెయిన్-రష్యా వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను బంగారం వైపు మళ్ళిస్తున్నాయి. కరెన్సీ విలువ పడిపోతుందనే భయం ఉన్నప్పుడు, ప్రపంచం మొత్తం నమ్మే ఏకైక ఆస్తి బంగారం మాత్రమే. అందుకే దీనిని 'సురక్షితమైన పెట్టుబడి' (Safe Haven) అని పిలుస్తారు.
ఆర్బీఐ కూడా బంగారం వెంటే..
కేవలం సామాన్యులే కాదు, మన దేశ సెంట్రల్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా గత పదేళ్లుగా తన బంగారు నిల్వలను 57.81 శాతం పెంచుకుంది. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద 880 టన్నుల బంగారం ఉంది. ప్రపంచంలో అత్యధికంగా బంగారు నిల్వలున్న దేశాల్లో భారత్ 8వ స్థానంలో ఉంది. డాలర్ మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకుల నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంటోంది. "గతంలో చమురు ధరలు ప్రపంచ ఉద్రిక్తతలకు నిదర్శనంగా ఉండేవి, ఇప్పుడు బంగారం ధరలే గ్లోబల్ టెన్షన్లకు బేరోమీటర్‌గా మారాయి" అని ఆర్బీఐ గవర్నర్ ఇటీవల పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఏంటి?
మనం బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటే అది ఆర్థికంగా "ఉత్పాదకత లేని ఆస్తి" (Non-yielding asset) అని నిపుణులు చెబుతారు. ఎందుకంటే ఆ డబ్బు మార్కెట్లో తిరగదు. అయితే, ఇటీవల 'గోల్డ్ లోన్' (బంగారు రుణాలు) పెరగడం వల్ల ఈ బంగారం కొంతవరకు ఆర్థిక వ్యవస్థలోకి వస్తోంది. బ్లాక్‌రాక్ సీఈఓ లారీ ఫింక్ చెప్పినట్లు, దేశాభివృద్ధిలో భాగం కావాలంటే స్టాక్ మార్కెట్లో పెట్టాలి, కానీ భయం నుండి రక్షణ పొందాలంటే బంగారంలో పెట్టాలి.
ఏది ఏమైనా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల వల్ల గోల్డ్ (Gold) కు ఉన్న డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. అది సామాన్య ఇల్లాలు అయినా శక్తివంతమైన ఆర్బీఐ అయినా.. పసిడిపై ఉన్న నమ్మకం మాత్రం అచంచలం.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications