టాప్ 4 కంపెనీల ఎం-క్యాప్ రూ.3 లక్షల కోట్లు జంప్, రిలయన్స్ వాటానే రూ.2.50 లక్షల కోట్లు

ముంబై: గతవారం టాప్ 10 కంపెనీల్లోని 4 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పెరిగింది. ప్రధానంగా ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంపద భారీగా ఎగిసింది. అంతకుముందు జియోలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు రిలయన్స్ రిటైల్‌లోకి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఒక్క సంస్థ ఎం-క్యాప్ దాదాపు మూడింతల కంటే ఎక్కువ ఎగిసింది. గత వారం సెన్సెక్స్ 497 పాయింట్లు లేదా 1.29 శాతం ఎగిసింది.

రూ.2.51 లక్షల కోట్లు అదరగొట్టిన రిలయన్స్

రూ.2.51 లక్షల కోట్లు అదరగొట్టిన రిలయన్స్

10 మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీల్లో నాలుగింటి సంపద గత వారం రూ.3,01,847.99 కోట్లు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ ఈ వారం రూ.15 లక్షల కోట్లకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ వారం రిలయన్స్ ఎం-క్యాప్ రూ.2,51,067.2 కోట్లు పెరిగి రూ.15,68,015.09 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ షేర్ ఆల్ టైమ్ గరిష్టం రూ.2,315 వద్ద ముగిసింది. ఇప్పటికే సిల్వర్ లేక్... రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడులు పెట్టింది. కేకేఆర్ పెట్టుబడులు పెట్టనుందనే వార్తలకు తోడు, అమెజాన్ 20బిలియన్ డాలర్ల పెట్టుబడితో 40% వాటా తీసుకుంటుందనే వార్తలు రిలయన్స్ షేర్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకోవడానికి కారణమైంది.

TCS, HUL, ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ అప్

TCS, HUL, ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ అప్

- టాటా కన్సల్టెన్సీ సర్వీసస్(TCS), హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, ఇన్ఫోసిస్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పెరిగింది.

- HDFC బ్యాంకు, HDFC, భారతీ ఎయిర్‌టెల్, కొటక్ మహీంద్రా బ్యాంకు, ICICI బ్యాంకు, ITC కంపెనీల మార్కెట్ క్యాప్ క్షీణించింది.

- టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.31,501.27 పెరిగి రూ.8,90,703.56 కోట్లకు చేరుకుంది.

- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.11,138.31 కోట్లు పెరిగి రూ.4,02,683.22 కోట్లకు పెరిగింది.

- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,141.21కోట్లు పెరిగి రూ.5,07,327.93 కోట్లకు పెరిగింది.

నష్టపోయిన కంపెనీలు..

నష్టపోయిన కంపెనీలు..

- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,727.92 కోట్లు తగ్గి రూ.5,93,512.25గా నిలిచింది.

- భారతీ ఎయిర్‌‌టెల్ ఎం-క్యాప్ రూ.17,157.73 పడిపోయి రూ.2,68,222.48 కోట్లుగా ఉంది.

- కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.9,608.05 కోట్లు తగ్గి రూ.2,63,207.24కు క్షీణించింది.

- ITC మార్కెట్ క్యాప్ రూ.3,383.8 క్షీణించి రూ.2,26,283.99 కోట్లకు పరిమితమైంది.

- ICICI బ్యాంకు ఎం-క్యాప్ రూ.1,823.57 పడిపోయి రూ.2,55,249.73 కోట్లుగా ఉంది.

- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.99.95 క్షీణించి రూ.3,17,221.68 కోట్లుగా ఉంది.

- టాప్ 10 విషయానికి వస్తే వరుసగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్, TCS, HDFC బ్యాంకు, HUL, ఇన్ఫోసిస్, HDFC, భారతీ ఎయిర్‌టెల్, కొటక్ మహీంద్ర బ్యాంకు, ICICI బ్యాంకు, ITC ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+