IPO News: అడుగు పెట్టగానే అప్పర్ సర్క్యూట్.. సంచలనంగా ఐపీవో.. ఇన్వెస్టర్లు ఖుషీ..!!
IPO News: ఈరోజు మార్కెట్లోకి అడుగుపెట్టిన రెండవ ఐపీవో కూడా షేర్లను పొందిన ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. మార్కెట్లోకి అడుగుపెట్టగానే అప్పర్ సర్క్యూట్ తాకి సంచనంగా మారింది.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది వాలియంట్ ల్యాబొరేటరీస్ ఐపీవో గురించే. మార్కెట్లోకి బలమైన లిస్టింగ్ నమోదు చేసిన ఇన్వెస్టర్లను ఐపీవో సంతోషంలోకి నెట్టేసింది. షేర్లు బీఎస్ఈలో 15 శాతం ప్రీమియం ధరకు అడుగుపెట్టాయి. కంపెనీ ఐపీవోలో ఒక్కో షేరును రూ.140కి ఇష్యూ చేయగా బీఎస్ఈలో రూ.161 రేటు వద్ద జాబితా చేయబడింది. మార్కెట్లో లిస్టయిన వెంటనే వాలియంట్ లాబొరేటరీస్ షేర్లు 5 శాతం ఎగువ సర్క్యూట్ రూ.169.05ని తాకాయి. దీంతో లిస్టింగ్ రోజున షేర్లు పొందిన ఇన్వెస్టర్లు 21 శాతం లాభాన్ని ఆర్జించారు.

ఇదే క్రమంలో ఎన్ఎస్ఈలో వాలియంట్ షేర్లు 15.8 ప్రీమియం ధరకు రూ.162.15 వద్ద లిస్ట్ అయ్యాయి. వాలియంట్ లాబొరేటరీస్ ఐపీవో మొత్తం 29.76 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. రిటైల్ కోటా 16.06 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడగా.. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 73.64 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల(QIB) కోటా 20.83 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.
కంపెనీ తాజా ఐపీవో ద్వారా మార్కెట్ల నుంచి రూ.152.46 కోట్లను సమీకరించింది. దీనికోసం షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.133-140గా నిర్ణయించింది. అలాగే ఒక్కో లాటులో 105 షేర్లను విక్రయించింది. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ ఇందులో పాల్గొనాలంటే కనీసం రూ.14,700 పెట్టుబడిగా పెట్టారు. ఐపీవోగా వచ్చిన ఔషధ పదార్థాల తయారీ సంస్థ దృష్టి పారాసెటమాల్ తయారీపైనే ఉంది. కంపెనీ తయారీ యూనిట్ మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ఉంది. ఈ ప్లాంట్ స్థాపిత సామర్థ్యం ఏడాదికి 9000 MTగా ఉంది.


Click it and Unblock the Notifications