IPO News: ఫ్లాట్ ఎంట్రీతో నిరాశపరిచిన ఐపీవో.. మీరూ షేర్లు పొందారా ఇన్వెస్టర్స్..??
IPO News: మార్కెట్లోకి అడుగుపెట్టిన జ్యువెలర్ ఐపీవో ఇన్వెస్టర్లను కొంత నిరాశకు గురిచేసింది. అయితే ఐపీవో లిస్టింగ్ నిపుణుల అంచనాలకు అనుగుణంగానే ఇది జరిగింది. ఫ్లాట్ ఎంట్రీ అనేక మందిని తీవ్ర నిరాశకు గురిచేసింది.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి, వజ్రాభరణాలను విక్రయిస్తున్న వైభవ్ జ్యువెలర్స్ ఐపీవో గురించే. షేర్లు ఈ రోజు దేశీయ మార్కెట్‌లో బలహీనంగా ప్రవేశించాయి. కంపెనీ ఒక్కో షేరును రూ.215కు విక్రయించగా.. ఇదే ధరకు బీఎస్ఈలో లిస్టింగ్ జరిగింది. లిస్టింగ్ లాభాలను ఆశించిన ఇన్వెస్టర్లను ఐపీవో నిరాశకు గురిచేసింది. అయితే అరంగేట్రం తర్వాత షేర్ ధర 2 శాతం పెరిగి రూ.219.80కు చేరుకుంది.

వైభవ్ జ్యువెలర్స్ సెప్టెంబర్ 22-27 వరకు చేపట్టిన ఐపీవోలో రూ.270.20 కోట్లను సమీకరించింది. ఐపీవో స్పందనను గమనిస్తే మొత్తం మీద 2.33 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఈ క్రమంలో 10 రూపాయలు ఫేస్ వ్యాల్యూ కలిగిన 97,67,442 కొత్త షేర్లు జారీచేసింది. అలాగే ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్ గ్రాంధి భారత్ మల్లికా రత్న కుమారి 28 లక్షల షేర్లను విక్రయించారు.
తాజాగా ఐపీవో నుంచి సమీకరించిన మెుత్తంలో రూ.172 కోట్లను రానున్న ఆర్థిక సంవత్సంలో 8 కొత్త షోరూమ్‌లను తెరవడానికి కంపెనీ వినియోగించనుంది. మిగిలిన డబ్బు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించనుంది. 2003లో స్థాపించబడిన మనోజ్ వైభవ్ జెమ్స్ 'ఎన్' జ్యువెలర్స్ దక్షిణ భారతదేశంలో వైభవ్ జ్యువెలర్స్‌గా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో వైభవ్ జ్యువెలర్స్ 13 రిటైల్ షోరూమ్‌లను కలిగి ఉంది. వీటిలో రెండు ఫ్రాంఛైజ్డ్ షోరూమ్‌లు. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.71.60 కోట్లు.. ఈ ఆర్థిక సంవత్సరం 2023-24 ఏప్రిల్-జూన్ మొదటి త్రైమాసికంలో రూ.19.24 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.


Click it and Unblock the Notifications