V Narayanan: దేశ కీర్తిని అంతరీక్షానికి తీసుకెళ్లిన ఇస్రో బాధ్యతలు కొత్త బాస్ చేతిలోకి వెళ్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎస్ సోమ్‌నాథ్ స్థానంలో కొత్తగా వి నారాయణన్ రాబోతున్నారు. దీనికి సంబంధించిన కీలక ప్రకటనను మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నారాయణన్ దీనికి తోడు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్‌కి సెక్రటరీగా కూడా వ్యవహరించనున్నారు. జనవరి 14, 2025 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు.
దీంతో రానున్న రెండేళ్ల పాటు ఇస్రోకి నారాయణన్ సారధ్యం వహించనున్నారు. అయితే ఈ రాకెట్ సైంటింస్ట్ నియామకం దేశ అంతరీక్ష పరిశోధనలో కొత్త అధ్యాయానికి ప్రారంభంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి అంతరీక్ష పరిశోధకుడిగా ఉన్న ఆయనకు రాకెట్స్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ కలిగి ఉండటం గమనార్హం. 1984లో ఇస్రోలో బాధ్యతలు ప్రారంభించిన నారాయణన్ ప్రస్తుతం లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ బాధ్యతలను చూసుకోనున్నారు. వాస్తవానికి ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వి విద్యార్థి కూడా.

విద్యాబ్యాసం విషయానికి వస్తే క్రయోజనిక్ ఇంజనీరింగ్ లో 1989లో ఎంటెక్ పూర్తి చేశారు. దీని తర్వాత 2001లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. ఈ క్రమంలో ఆస్ట్రోనాట్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. ఇస్త్రో కూడా అనేక సందర్భాల్లో ఆయనను వివిధ అవార్డులతో సత్కరించింది. ఇస్రోలో ఆయన చేసిన కృషి భారత్ ప్రపంచంలో క్రయోజనిక్ ప్రొపల్షన్ సిస్షమ్ కలిగి ఉన్న 6వ దేశంగా భారత్ మారటంలో ఎంతగానో దోహదపడింది. ఈ క్రమంలో స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ విషయంలో ఇస్రో రానున్న 20 ఏళ్లకు అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవటంలో దోహదపడింది.
వాస్తవానికి చంద్రయాన్ -2 విఫలానికి సంబంధించిన కారణాలను పరిశీలించే కమిటీలో కీలకంగా వ్యవహరించారు. ల్యాండర్ క్రాష్ తర్వాత చంద్రయాన్ -3 సక్సెస్ కావటానికి ఆయన అందించిన సొల్యూషన్ కూడా కీలకంగా మారింది. ప్రస్తుతం ఆయన 2018 నుంచి కేరళలో వలియమలలో ఉన్న లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ హెడ్ గా కొనసాగుతున్నారు. అక్కడ లిక్విడ్, సెమీ క్రయోజనిక్, క్రయోజనిక్ ప్రొపల్షన్ లపై పనిచేస్తున్నారు. వాస్తవానికి రాకెట్ ప్రయోగాల్లో వాహకనౌత ఎగరటంలో వీటికి కీలక పాత్ర ఉంటుంది. ఇక చివరిగా ఇస్రో చీఫ్‌గా రెండేళ్ల పదవీ కాలంలో ఆయన స్పేస్ కమిషన్ చైర్మన్‌గా కూడా వ్యవహరించనున్నారు.
ప్రస్తుతం నారాయణన్ అత్యంత విశిష్ట శాస్త్రవేత్తలలో ఒకరిగా నిలిచారు. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ ఫర్ ది స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ ఛైర్మన్‌తో సహా అతని నాయకత్వం కీలకమైన పాత్రలకు విస్తరించింది, ఇక్కడ అతను అన్ని లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్‌లలో కీలకమైన నిర్ణయాలను పర్యవేక్షిస్తారు. ఇకపై ఆయన భారత అంతరీక్ష ప్రయాణానికి మార్గనిర్థేశం చేయనున్నారు. ఇది కొత్త చరిత్ర లిఖించటంలో దోహదపడనుంది.


Click it and Unblock the Notifications