For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Viral News: కూలీ బ్యాంక్ ఖాతాలో వేల కోట్లు.. చూసిన వారు షాక్.. ఎక్కడి నుంచి వచ్చాయంటే..?

|

Viral News: ఒక రోజువారీ కూలీ దగ్గర మహా అయిరే ఒక రోజుకో లేకుంటే ఒక వారానికి సరిపడా డబ్బు ఉంటాయి. అలాంటి అతని బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ.2,700 కోట్లు బ్యాలెన్స్ ఉంటుందా? కానీ.. ఇది వాస్తవంగా ఉత్తరప్రదేశ్ లో జరిగింది. అసలు మన ఖాతాలో బ్యాలెన్స్ పెరిగినా, తగ్గినట్లు ఎలాంటి మెసేజ్ వస్తే వెంటనే ఏటీఎంకు వెళ్లి వెంటనే చెక్ చేసుకుంటాం. అయితే ఆ వ్యక్తికి వచ్చిన sms చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

 బీహారీ లాల్ బ్యాంక్ అకౌంట్లో..

బీహారీ లాల్ బ్యాంక్ అకౌంట్లో..

బీహారీ లాల్ అనే తన ఖాతాలో కేవలం రూ.100 విత్‌డ్రా చేసేందుకు వెళ్లిన వ్యక్తికి తన ఖాతాలో వేల కోట్ల డబ్బు ఉందంటూ ఎస్‌ఎంఎస్‌ రావటంతో షాక్ అయ్యాడు. ఒక పక్క సంతోషం మరో పక్క ఎలా వచ్చాయా అనే ఆందోళనతో అతని మెదడులో వేల ప్రశ్నలు తలెత్తి ఉండవచ్చు.

జన్ ధన్ బ్యాంకు ఖాతాలో రూ.2,700 కోట్లు..

జన్ ధన్ బ్యాంకు ఖాతాలో రూ.2,700 కోట్లు..

45 ఏళ్ల బిహారీ లాల్ రోజువారీ కూలీ ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. అతని జీతం రోజుకు 600-800 రూపాయలు మాత్రమే. వర్షాల కారణంగా స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆ సమయంలో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జన్ ధన్ బ్యాంక్ ఖాతా ఉంది. తన ఖాతాలో 100 రూపాయలు విత్‌డ్రా చేసుకున్న తరువాత బ్యాలెన్స్ రూ.2,700 కోట్లు ఉన్నట్లు మెసేజ్ చూసి షాక్ అయ్యాడు.

కొన్ని గంటల్లోనే..

కొన్ని గంటల్లోనే..

ఆశ్చర్యపోయిన సదరు రోజువారీ కూలీ బ్యాంకుకు వెళ్లి ఈ విషయాన్ని ధృవీకరించుకున్నాడు. అయితే బీహారీ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే అతని జన్ ధన్ బ్యాంకు ఖాతాలో కేవలం రూ.126 ఉన్నాయి.

బ్యాంకు ఏమని చెప్పింది?

బ్యాంకు ఏమని చెప్పింది?

బిహారీ లాల్ వెంటనే బ్యాంకుకు తన మెుబైల్ కు వచ్చిన మెసేజ్‌ని చూపించాడు. దానిని చూసిన బ్యాంకు అధికారులు సైతం ఒక్కసారిగా నివ్వెరపోయారు. పలుమార్లు స్టేట్‌మెంట్‌ను పరిశీలించారు. బీహారీ ఖాతాలో 27,07,85,13,985 కోట్లు ఉన్నట్లు నిర్ధారించారు. సాంకేతిక సమస్య కారణం వల్లనే అలా జరిగిందని బ్యాంక్ వెల్లడించింది. వెంటనే దానిని సరిదిద్దారు.

English summary

Viral News: కూలీ బ్యాంక్ ఖాతాలో వేల కోట్లు.. చూసిన వారు షాక్.. ఎక్కడి నుంచి వచ్చాయంటే..? | uttarpradesh labour shocked after knowing his bank balance was 2700 crore rupees jan dhan yojana account

uttarpradesh labour shocked after knowing bank balance
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X