Utkarsh Small Finance IPO: ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న చాలా ఐపీవోలు ఇన్వెస్టర్లను అస్సలు నిరాశకు గురిచేయటం లేదు. తొలిరోజు వారి పెట్టుబడిని డబుల్ చేసేస్తూ వారిలో ఉల్లాస్సాన్ని పెంచుతున్నాయి.
SME క్యాటగిరీలో మార్కెట్లోకి వచ్చిన బ్యాంకింగ్ ఐపీవో నేడు లిస్ట్ అయ్యింది. ఈ క్రమంలో మంచి లాభాలతో తొలిరోజే దూసుకుపోతోంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించే. ఈ ఐపీవో BSEలో 59.80 శాతం ప్రీమియంతో రూ.39.95 ధర వద్ద లిస్టింగ్ చేయబడింది. అదే సమయంలో ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేర్ రూ.40 వద్ద లిస్టింగ్ జరిగింది.

బ్యాంకింగ్ కంపెనీ తన షేర్లను రూ.23 నుంచి రూ.25 ధరకు విక్రయించింది. అయితో లిస్టయిన తొలిరోజే మార్కెట్లలో ఐపీవోకు మంచి స్పందన లభిస్తోంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ IPO 12 జూలై 2023 నుంచి 14 జూలై 2023 వరకు తెరవబడింది. పెట్టుబడిదారులు దీనికి సబ్‌స్క్రయిబ్ చేసుకోవడానికి 3 రోజుల కాలంలో కొనుగోలు చేయటానికి లాట్ పరిమాణం 600 షేర్లుగా నిర్ణయించబడింది. అంటే ఐపీవోలో షేర్లను కొనుగోలు చేసేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.15,000 పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది.
మూడు రోజుల సబ్‌స్క్రిప్షన్ సమయంలో కంపెనీ షేర్లు 133 సార్లు సభ్యత్వం పొందింది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ IPO జూలై 14న 110.77 సార్లు సబ్‌స్క్రిప్షన్ చేయబడింది. రిటైల్ విభాగంలో 78.38 శాతం, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కేటగిరీలో 135.71 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేటగిరీలో 88.74 రెట్లు సబ్‌స్క్రిప్షన్ ఐపీవో పొందింది.
జూలై 21 ఉదయం గ్రే మార్కెట్‌లో కంపెనీ షేర్లు రూ.16.10 ప్రీమియం వద్ద ఉన్నాయి. అయితే 11.36 గంటల సమయంలో షేర్ ధర ఎన్ఎస్ఈలో 92 శాతం లాభపడి రూ.48 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications