IPO News: నూతన ఆర్థిక సంవత్సరం మెుదటి త్రైసికం చివరి నుంచి ఒక్కసారిగా మార్కెట్లోకి ఐపీవోల రాక మెుదలైంది. దీంతో ఇన్వెస్టర్ల నుంచి స్పందన సైతం వీటికి అంతే స్థాయిలో సానుకూలంగా లభిస్తోంది.
గతకొన్నేళ్లుగా దేశంలో జరుగుతున్న డిజిటల్ రెవల్యూషన్ మార్పులతో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కీలకంగా మారాయి. దిగ్గజ బ్యాంకింగ్ సంస్థలకు ఏమాత్రం తీసిపోకుంటా సేవలను అందిస్తూ.. ప్రజలకు మరింత చేరువ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీవోతో మార్కెట్లకి అడుగు పెడుతోంది. సబ్‌స్క్రిప్షన్ కోసం వచ్చే వారం వస్తున్న ఈ బ్యాంక్ తన ఐపీవో ఫ్రైస్ బ్యాండ్ ను రూ.23-25గా నిర్ణయించినట్లు ప్రకటించింది.

పబ్లిక్ ఇష్యూ జూలై 12న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడి జూలై 14న ముగుస్తుంది. దీనికి ఒక్క రోజు ముందల జూలై 14న యాంకర్ ఇన్వె్స్టర్ల కోసం బుక్కింగ్ ఓపెన్ చేయబడుతుంది. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీవో ద్వారా రూ.500 కోట్లను సమీకరిస్తోంది. ఆఫర్‌లో దాని ఉద్యోగుల కోసం ఇష్యూ పరిమాణంలో 1 శాతం వరకు రిజర్వ్ చేసింది. వారికి రూ.5 కోట్లు విలువైన 20 లక్షల షేర్లను కంపెనీ ఉద్యోగులకు అందిస్తోంది. ఇష్యూ నుంచి వచ్చిన మెుత్తాన్ని కంపెనీ భవిష్యత్ మూలధన అవసరాల కోసం వినియోగించాలని చూస్తోంది.
ఇది ఇష్యూ పరిమాణంలో 75 శాతం వరకు అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు, 15 శాతం అధిక నెట్‌వర్త్ వ్యక్తులకు, మిగిలిన 10 శాతం రిటైల్ పెట్టుబడిదారుల కోసం బ్యాంక్ కేటాయించింది. వారణాసి కేంద్రంగా పనిచేస్తున్న ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ CRISIL నివేదిక ప్రకారం రూ.6,000 కోట్ల కంటే ఎక్కువ స్థూల లోన్ పోర్ట్‌ఫోలియోతో SFBలలో FY19-FY23 మధ్య మూడవ వేగవంతమైన స్థూల రుణ పోర్ట్‌ఫోలియో వృద్ధిని నమోదు చేసింది. మార్చి 2023 నాటికి 830 బ్యాంకింగ్ అవుట్‌లెట్‌లు, 15,424 మంది ఉద్యోగులతో 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.


Click it and Unblock the Notifications