భారతీయ వ్యాపారవేత్తలకు బెస్ట్ లీడర్ షిప్ అవార్డులు వరించాయి . యూస్-ఇండియా ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహించడంలో ఆదర్శప్రాయమైన దృష్టికి, వారు చేసిన కృషికి గుర్తింపుగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరియు అడోబ్ చైర్మన్ మరియు సిఇఒ శాంతను నారాయణ్ లకు 2020 లీడర్‌షిప్ అవార్డులతో సత్కరించనుంది యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్.
ఈ అవార్డును మూడవ వార్షిక నాయకత్వ సదస్సులో "యుఎస్-ఇండియా వీక్: నావిగేటింగ్ న్యూ ఛాలెంజెస్" పేరుతో ప్రదానం చేస్తారు, ఇది ఆగస్టు 31 వ తేదీన జరగనుంది . యుఎస్-ఇండియా ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో అద్భుతమైన నాయకత్వం ప్రదర్శించిన ఇద్దరు వ్యాపారవేత్తలకు 2020 లీడర్‌షిప్ అవార్డులను ప్రదానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు బోర్డు ఛైర్మన్ జాన్ ఛాంబర్స్ .

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితులను ఎదుర్కొంటున్న సమయంలో, ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు బలోపేతం అవటానికి వారు ఎంతో కృషి చేస్తున్నారని యుఎస్ఐఎస్పిఎఫ్ బోర్డు ఛైర్మన్ జాన్ ఛాంబర్స్ అన్నారు.
ఈ వారం ప్రారంభంలో, యుఎస్ఐఎస్పిఎఫ్ శిఖరాగ్ర సదస్సులో వక్తలు వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ , భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, వాణిజ్య పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ తో పాటు భారతదేశంలో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్, యుఎస్‌లో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు మరియు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ పాల్గొంటారని జాబితా విడుదల చేశారు .


Click it and Unblock the Notifications