2024లో భారతదేశం మొత్తం రూ.22,842 కోట్లు సైబర్ నేరస్తుల చేతిలో కోల్పోయింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని DataLEADS అనే మీడియా-టెక్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. ఆ సంస్థ అంచనాల ప్రకారం, వచ్చే కొద్ది నెలల్లోనే దేశవ్యాప్తంగా సైబర్ మోసాల కారణంగా భారతులు రూ. 1.2 లక్షల కోట్లు కోల్పోయే ప్రమాదం ఉంది.

మూడు ఏడ్లలోనే పదింతలు పెరిగిన మోసాల విలువ:
2022లో మోసాల విలువ: రూ 2,306 కోట్లు
2023లో మోసాల విలువ: రూ 7,465 కోట్లు
2024 లో మోసాల విలువ: రూ 22,842 కోట్లు
ఇది చూస్తే మూడు సంవత్సరాలలో డిజిటల్ మోసాలు పదింతలు పెరిగినట్లు అర్థమవుతుంది. అదే విధంగా, సైబర్ క్రైమ్ ఫిర్యాదుల సంఖ్య కూడా భయంకరంగా పెరిగింది. 2019లో 2 లక్షల ఫిర్యాదులు వస్తే, 2024లో దాదాపు 20 లక్షల పైగా కేసులు నమోదయ్యాయి.
డిజిటల్ మోసాల ఉధృతి ఎందుకు?
UPI, Paytm, PhonePe లాంటి డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లు విస్తృతంగా వినియోగంలోకి వచ్చాయి. కరోనా సమయంలో క్యాష్ లావాదేవీలను తగ్గించేందుకు ప్రభుత్వం UPI లను ప్రోత్సహించింది. గ్రామీణ ప్రాంతాల వరకు డిజిటల్ సేవలు వెళ్ళాయి.
2019 నాటికి దేశవ్యాప్తంగా 44 కోట్ల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉన్నారు. డేటా ధరలు కూడా ప్రపంచంలోనే అతి తక్కువగా ఉండటంతో ప్రజలు ఎక్కువగా మొబైల్ ద్వారా ఆర్థిక లావాదేవీలు చేయడం మొదలుపెట్టారు. ఈ మార్పులతో పాటు సైబర్ మోసగాళ్ల కూడా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకుంటూ మోసాలను మరింత కష్టతరంగా తయారుచేస్తున్నారు.
సైబర్ మోసాల రూపాలు:
ఫిషింగ్ మెసేజ్‌లు (Phishing):
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి పేరుతో 'రిఫండ్', 'గిఫ్ట్' వంటి మెసేజ్‌లు వస్తాయి. వాటిలో ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే UPI పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ డేటా లీకవుతాయి.
నకిలీ ఉత్పత్తులు:
OLX, ఫేస్‌బుక్ మార్కెట్ వంటి ప్రదేశాల్లో చాలా తక్కువ ధరకు ఫోన్‌లు, గాడ్జెట్లు కనిపిస్తాయి. ఆర్డర్ చేసిన తర్వాత కనపడరు.
చెల్లింపు ధృవీకరణ మోసాలు (Payment Confirmation Scams):
"మీరు ఈ లింక్ క్లిక్ చేసి పేమెంట్ కన్ఫర్మ్ చేయండి" అంటూ వచ్చే మెసేజ్‌లు. క్లిక్ చేసిన వెంటనే మీ ఫోన్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
మోసగాళ్లు ఎక్కువగా ఎక్కడ యాక్టివ్‌గా ఉన్నారు?
WhatsApp ప్రధాన కేంద్రంగా మారింది. 2024లో జనవరిలోనే WhatsAppలో ఫైనాన్స్ సంబంధిత 15,000కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఫిబ్రవరిలో 14,000, మార్చిలో 15,000 ఫిర్యాదులు నమోదయ్యాయి.
బ్యాంకింగ్ రంగం పై అతిపెద్ద దాడి
2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి ఆరునెలల్లో బ్యాంకింగ్ మోసాలు ఎనిమిదింతలు పెరిగాయి. మోసాల విలువ: రూ 2,623 కోట్ల నుంచి రూ 21,367 కోట్లకు ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నా, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఖాతాదారులే పెద్ద మొత్తాలు కోల్పోయారు. మొత్తం రూ 25,667 కోట్లు.
బీమా రంగం కూడా టార్గెట్:
హెల్త్, లైఫ్, వాహన బీమాలు అందిస్తున్న కంపెనీల పేర్లతో కూడా మోసాలు జరుగుతున్నాయి.
WhatsAppలో HDFC, Kotak, Shriram, Royal Sundaram లాంటి బ్రాండ్ల పేరుతో నకిలీ ముసుగులో సందేశాలు పంపిస్తున్నారు.
మోసాల వెనుక AI, డీప్‌ఫేక్ టెక్నాలజీ ఈ రోజు సైబర్ మోసగాళ్లు కేవలం ఫోన్ కాల్స్‌కే పరిమితం కావడం లేదు. AI టెక్నాలజీని ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియోలు తయారుచేస్తున్నారు. సెలబ్రిటీల మాటల్లో మాట్లాడే నకిలీ వీడియోలు పంపిస్తూ భరోసా కలిగించడమే లక్ష్యం.
ప్రస్తుతం ప్రభుత్వం కొత్త కఠిన నిబంధనలు తీసుకువచ్చినప్పటికీ, ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ అనడానికే కాకుండా పరిరక్షణ ఉండాలి, బాధ్యత వహించే సాంకేతిక కంపెనీలు ఉండాలి, అప్పుడే మోసాల నియంత్రణ సాధ్యం.
మీకు ఒక మోసపూరిత సందేశం వచ్చినా వెంటనే చేయవలసినవి:
అపరిచిత లింకులు క్లిక్ చేయవద్దు. ఫోన్‌లో అంతుచిక్కని యాప్స్ ఇన్‌స్టాల్ చేయవద్దు. OTP, పాస్‌వర్డ్ ఎవరితోనూ పంచుకోవద్దు. Cyber Crime పోర్టల్ (cybercrime.gov.in)లో ఫిర్యాదు చేయండి. 1930 నెంబర్‌కు కాల్ చేసి తక్షణ చర్య కోరండి.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెంది దేశానికి ఉపయోగపడుతుందనుకున్నప్పటికీ అదే వేగంతో మోసగాళ్ల మార్గాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఎన్నికపై అవగాహన, అప్రమత్తత, అవసరమైన సాంకేతిక జాగ్రత్తలు మాత్రమే మన డబ్బును రక్షించగలవు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications