ఒకప్పుడు టెక్నాలజీ అంటే పనిని తేలిక చేయడమే లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు అదే టెక్నాలజీ ఉద్యోగాలని తీసేస్తుందనే భయాన్ని పెంచేస్తోంది. అయితే ఈ భయాన్ని కొట్టిపారేస్తూ "AI వల్ల ఉద్యోగాలు పోతాయన్నది పూర్తిగా అర్థంలేని మాటే" అంటున్నారు Salesforce CEO మార్క్ బెనియాఫ్.

ప్రస్తుతం చాలా కంపెనీలు "AI వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది" అనే పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కాని బెనియాఫ్ మాత్రం ఇలాంటి నిర్ణయాల వెనక నిజంగా AI ఉన్నదా లేక మరొకటి ఉందా అన్నదే ఆయన ప్రశ్న. ఒక CEOగా నేను మిగిలిన CEOలని అడుగుతున్నా... మీరు అసలు ఏ AI టూల్ వాడుతున్నారో చూపించండి, మీరు చేసే ఉద్యోగాల తొలగింపు నిజంగా AI వల్లేనా?" అని ఆయన బహిరంగంగా ప్రశ్నించారు.
బెనియాఫ్ చెబుతున్నదాని ప్రకారం, తమ సంస్థలో 30-50% వరకు పని ఇప్పటికే AI చేస్తోంది. ఉదాహరణకు: కస్టమర్ సపోర్ట్ చాట్స్‌లో 85% ప్రశ్నలకు AI సమాధానం ఇస్తోంది. కొత్తగా డెవలప్ చేసే కోడ్‌లలో 25% వరకు AI సహాయంతో తయారవుతోంది. అయినా కూడా "మేము ఏ ఉద్యోగినీ కేవలం AI వల్లే తొలగించలేదు" అని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రశ్నకు బెనియాఫ్ సమాధానం చాలా స్పష్టంగా ఉంది. AI అనేది మనిషి స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చినది కాదు, మన పనిని వేగవంతం చేయడానికి వచ్చిన సాధనం. అయితే అదే టూల్‌ని ఎలా వాడుతామో అన్నది ప్రతీ కంపెనీకి, ప్రతీ ఉద్యోగికి ఎంతో కీలక పరీక్ష.
బెనియాఫ్ చెప్పిన మాట ప్రకారం "ప్రతి AIకి ఒక ఫ్యాక్ట్ చెకర్ ఉండాలి. ఆ ఫ్యాక్ట్ చెకర్ మళ్లీ AI కాకూడదు మానవుడే అయి ఉండాలి."AI ఎంతటి టెక్నాలజీ అయినా, దాన్ని నియంత్రించేది మనిషే కావాలి అని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ మారుతున్న యుగంలో ఉద్యోగ భద్రత కోసం, మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కేవలం మనం చేసే పని కాకుండా మన టూల్స్‌ని ఎలా వాడాలో, డేటాను ఎలా అర్థం చేసుకోవాలో, AIతో సహకరించి ఎలా పనిచేయాలో నేర్చుకోవడం అవసరం.
అలాగే, బెనియాఫ్ అభిప్రాయం ప్రకారం AI వల్ల పెద్ద కంపెనీలకే కాదు, చిన్న వ్యాపారాలకు, స్టార్టప్‌లకు కూడా కొత్త అవకాశాలు వస్తాయంటున్నారు. "AI మన చేతిలో ఉన్న ఓ శక్తివంతమైన టూల్ మాత్రమే కాని భయపడేది కాదు, దానిని ఉపయోగించి ఎదగాలి" అని ఆయన చెప్పడం గమనార్హం.
మార్క్ బెనియాఫ్ లాంటి వ్యాపార నాయకులు దీన్ని ఒక అవకాశంగా చూస్తూ, మనుషుల అవసరాన్ని నిరాకరించని విధంగా దాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలంటున్నారు. ఈ మార్పును మానవతతో, విజ్ఞానంతో ఎదుర్కొనాలి. అప్పుడే టెక్నాలజీ మనకి పని తీసేయకుండా పనిని చేయించగలదు.


Click it and Unblock the Notifications