Meta News: నిలిచిన మెటా సేవలు.. సోషల్ మీడియా బ్లాక్ అవుట్.. మార్క్ మామ లాస్ ఎంతంటే..
Instagram News: మానవజీవితంలో టెక్నాలజీకి ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యత పెరిగిపోయింది. రోజువారీ వినియోగిస్తున్న ఏవైనా సేవల్లో లోపం తలెత్తితే దాని పర్యవసానం చాలా పెద్దగా ఉంటోంది. తాజాగా మెటాకు చెందిన పలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో దాని యజమాని మార్క్ జుకర్‌బర్గ్ తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా మెటా ప్లాట్‌ఫారమ్‌లలో పెద్ద అంతరాయం ఏర్పడింది. నిన్న సోషయల్ మీడియా అంతా దాదాపు ఖాళీగా కనిపించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు వాట్సాప్ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాలు అన్నీ పని చేయడం ఆగిపోయాయి. వీటిని తిరిగి పునరుద్ధరించడానికి రెండు గంటలు పట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఈ విస్తృతమైన అంతరాయం బిలియన్ల మంది వినియోగదారులను డిస్‌కనెక్ట్ చేసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం మెటాపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపినట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి ప్లాట్‌ఫారమ్స్ డౌన్ నివేదికలు వెల్లువెత్తడం ప్రారంభించాయి. దీంతో మెటా షేరు ధర 1.5 శాతం క్షీణించింది.
చాలా మంది వినియోగదారులు అకస్మాత్తుగా ఫేస్‌బుక్ నుంచి లాగ్ అవుట్ అయ్యారు. ఈ అకస్మాత్తు పరిణామం వల్ల వినియోగదారులు గందరగోళానికి గురయ్యారు. ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్, వాట్సాప్ లు ఫీడ్ వైఫల్యం సహా సందేశం పంపే సమస్యలను ఎదుర్కొన్నాయి. ఈ ఆందోళనలపై మెటాకు చెందిన ఆండీ స్టోన్ X లో స్పందించారు. అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ, త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని భరోసా ఇచ్చారు.
ఈ భారీ అంతరాయం వల్ల జుకర్‌బర్గ్ పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్లాట్‌ఫారమ్‌లలో తలెత్తిన సమస్య వల్ల ఆయన సుమారు 100 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయారని వెడ్‌బుష్ సెక్యూరిటీస్ మేనేజింగ్ డైరెక్టర్ డాన్ ఐవెస్ అంచనా వేశారు. 2021లో సాంకేతిక సమస్య తలెత్తగా 7 గంటలపాటు మోటా ప్లాట్‌ఫారమ్స్ సర్వీసులు నిలిచిపోయాయి. కాగా ఇప్పుడు 2 గంటల్లోనే సమస్య పరిష్కారమైంది.


Click it and Unblock the Notifications