అంబానీ కంపెనీపై నెటిజన్ల ఆగ్రహం.. సోషల్‌ మీడియాలో ట్రోల్స్.. ట్రెండింగ్‌లో జియోసినిమా

Jiocinema: భారతీయులకు క్రికెట్ అంటే ఎనలేని ప్రేమ. ఇతర క్రీడలు వేటికీ లేనంత ఆదరణ ఈ గేమ్‌ కు ఉంటుంది. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ ను డిస్నీ+హాట్‌స్టార్‌లో రికార్డు స్థాయిలో ప్రజలు వీక్షించారు. అనంతరం వైజాగ్ వేదికగా జరిగిన ఇండియా vs ఆస్ట్రేలియా మ్యాచ్ మాత్రం అభిమానుల సహనాన్ని పరీక్షించింది.

నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి T20 మ్యాచ్‌కు జియోసినిమా స్ట్రీమింగ్ పార్టనర్‌గా వ్యవహరించింది. అయితే ప్రత్యక్ష ప్రసారంలో పలుమార్లు సమస్యలు తలెత్తడంతో అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. వీడియో బఫరింగ్ అవుతుండటంతో పాటు పదేపదే యాప్‌ను అప్‌డేట్ చేయాలని అభ్యర్థిస్తూ వచ్చిన సందేశాలు చికాకు పుట్టించాయి.

User facing issues while watching Ind vs Aus T20 match in JioCinema

ఇతర ప్లాట్‌ఫారమ్స్‌లో ఎటువంటి ఇబ్బందీ తలెత్తలేదు. దీంతో క్వాలిటీ కంటెంట్ అందించడంతో జియోసినిమా వెనుకబడి ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీక్షకుల సంఖ్య 8 కోట్లకు చేరుకోవడంతో సమస్య తలెత్తినట్లు కొందరు వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

ఈ అంతరాయంపై పలువురు వినియోగదారులు Xలో ఫిర్యాదులు లేవనెత్తారు. వివిధ రకాల మీమ్స్‌తో జియోసినిమా టార్గెట్‌గా కామెంట్స్ చేశారు. దీంతో జియోసినిమా హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది. యూజర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై ఇప్పటివరకు కంపెనీ యాజమాన్యం అధికారికంగా స్పందించలేని తెలుస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+