అమెరికా వెళ్లాలంటే ఏడాది ముందు వీసా కోసం అప్లై చేసుకోవాల్సిందే.. కారణం ఏంటంటే..

US Visa Waiting Time: అమెరికా ప్రయాణం చేయాలనుకునే భారతీయ పర్యాటకులు, వ్యాపారవేత్తలకు యూఎస్ విజిటర్ వీసా ఇంటర్వ్యూ స్లాట్ దక్కడం రోజురోజుకూ కష్టతరంగా మారుతోంది. అమెరికా విజిటర్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ పొందడానికి భారతీయ దరఖాస్తుదారులు సగటున దాదాపు ఏడాది పాటు అంటే 346 రోజులు నిరీక్షించాల్సి వస్తోందని యూఎస్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ తమ తాజా నివేదికలో వెల్లడించింది.

కోవిడ్-19 మహమ్మారికి ముందు ఉన్న 42 రోజుల సగటు నిరీక్షణ సమయంతో పోలిస్తే ఇది ఏకంగా ఎనిమిది రెట్లు పెరగడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక వీసాల కోసం అత్యధిక కాలం వేచి ఉండాల్సిన దేశాల జాబితాలో భారతదేశం ఏడవ స్థానంలో నిలిచింది. కొలంబియా, టర్కీ, కెనడా దేశాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

భారత్‌ నుంచి అమెరికా వీసాలకు డిమాండ్ విపరీతంగా పెరిగినప్పటికీ.. దానికి అనుగుణంగా యూఎస్ విదేశాంగ శాఖ కాన్సులర్ అధికారులను నియమించకపోవడమే ఈ సుదీర్ఘ ఆలస్యానికి ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని యూఎస్ ఎంబసీ, కాన్సులేట్లలో నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను పరిశీలించేందుకు కేవలం 68 మంది అధికారులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. వీరు ఏకంగా 14.55 లక్షల దరఖాస్తులను పరిశీలించాల్సి వచ్చింది. అంటే భారత్‌లోని ప్రతి కాన్సులర్ అధికారి సగటున 21,401 దరఖాస్తుల భారాన్ని మోశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అధిక పనిభారాలలో ఒకటిగా నమోదైంది.

US Visa Wait for Indians US Visa Delay US Visa News US Visa for Indians US Visitor Visa US Tourist Visa US Visa Interview US Visa Waiting Time 346 Days Visa Wait US Visa Queue India US Visa Visa Appointment Wait Time GAO Visa Report US Consular Officers US Visa Interview Delay America Visa News US Visa Wait US Visa for Indians US Visa News US Visa Delay US US Visitor Visa US Tourist Visa US Visa Interview

చైనాతో పోల్చి చూస్తే భారత్‌లోని కాన్సులర్ అధికారులపై ఎంతటి తీవ్రమైన ఒత్తిడి ఉందో స్పష్టమవుతోంది. చైనాలో 12.06 లక్షల దరఖాస్తుల పరిశీలనకు 119 మంది అధికారులు ఉన్నారు. అంటే అక్కడ ఒక్కో అధికారికి 10,135 దరఖాస్తుల పనిభారం మాత్రమే ఉండటంతో, ఇంటర్వ్యూ నిరీక్షణ సమయం అక్కడ కేవలం 34 రోజులుగానే ముగిసింది. చైనా కంటే భారత్ నుంచే అత్యధికంగా దరఖాస్తులు వచ్చినప్పటికీ, ఇక్కడ 51 మంది అధికారులు తక్కువగా ఉండటం వల్ల నిరీక్షణ సమయం విపరీతంగా పెరిగిపోయింది. మెక్సికోలో కూడా అధికారులు ఎక్కువ దరఖాస్తులను పరిశీలించినప్పటికీ, అక్కడ కూడా భారత్ కంటే 63 రోజులు తక్కువ నిరీక్షణ సమయం నమోదైంది.

Also Read

ఈ సుదీర్ఘ వీసా నిరీక్షణ సమయాలు కేవలం ప్రయాణికులనే కాకుండా అమెరికా పర్యాటక రంగాన్ని, దాని ఆర్థిక వ్యవస్థను కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. గడిచిన ఏడాది అంతర్జాతీయ ప్రయాణాలు, పర్యాటకం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు లభించిన రాబడి మునుపటి కంటే సుమారు 5 బిలియన్ డాలర్లు తగ్గింది. పర్యాటక వీసాల ప్రాసెసింగ్‌లో జరుగుతున్న ఆలస్యం కూడా ఈ ఆదాయ క్షీణతకు ప్రధాన కారణాలలో ఒకటిగా అధికారులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు కాన్సులేట్ కార్యాలయాలలో ఉన్న పనిభారాన్ని అంచనా వేసి, డిమాండ్‌‌కు తగినట్లుగా సిబ్బందిని క్రమం తప్పకుండా పునర్వ్యవస్థీకరించాలని ఆడిట్ విభాగం సిఫార్సు చేసినప్పటికీ యూఎస్ విదేశాంగ శాఖ స్పందించలేదు.

మరోవైపు భారత్‌లో కొంతమంది యూఎస్ విజిటర్ వీసాని ఒక సామాజిక హోదాగా భావించి దరఖాస్తు చేసుకుంటారని, నిజంగా ప్రయాణించే ఉద్దేశం లేని ఇటువంటి దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించడానికి అదనపు సమయం పడుతోందని విదేశాంగ శాఖ అధికారులు వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే ఈ 346 రోజుల సమయం అనేది కేవలం సగటు గణాంకం మాత్రమేనని, ప్రతి దరఖాస్తుదారునికి ఈ సమయం వర్తించదని, దరఖాస్తు కేటగిరీ, అపాయింట్‌మెంట్ లభ్యతను బట్టి వాస్తవ నిరీక్షణ సమయం మారవచ్చని నివేదిక వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+