అమెరికా వెళ్లాలనుకునే వారికి, ముఖ్యంగా గ్రీన్ కార్డ్ లేదా పర్మినెంట్ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి షాకింగ్ న్యూస్. ట్రంప్ ప్రభుత్వం వలసల విషయంలో తన ఉక్కుపాదాన్ని మోపింది. ఏకంగా 75 దేశాలకు చెందిన పౌరులకు 'ఇమ్మిగ్రెంట్ వీసాలను' నిరవధికంగా నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుల వల్ల ఎవరికి నష్టం? ఇండియా పరిస్థితి ఏంటి? అసలు ఈ 'పబ్లిక్ ఛార్జ్' రూల్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సంచలన నిర్ణయం: జనవరి 21 నుంచే అమలు!
అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 21 నుండి పాకిస్తాన్, రష్యా, థాయ్‌లాండ్, ఇరాన్, బ్రెజిల్ వంటి దాదాపు 75 దేశాల పౌరులకు ఇమ్మిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేస్తున్నారు. అమెరికా పౌరసత్వం లేదా శాశ్వత నివాసం (Green Card) కోరుకునే వారికి ఇది పెద్ద ఎదురుదెబ్బ. అమెరికాలోని సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సాయంపై ఆధారపడే అవకాశం ఉన్నవారిని అడ్డుకోవడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
ఎందుకీ వీసాల నిలిపివేత?
దీని వెనుక పబ్లిక్ చార్జ్ (Public Charge)అనే కీలకమైన నిబంధన ఉంది. అంటే ఎవరైనా విదేశీయుడు అమెరికాకు వచ్చి అక్కడి ప్రభుత్వ ధనం (Welfare benefits) మీద ఆధారపడి బతుకుతారని అనిపిస్తే.. వారికి వీసా నిరాకరించే అధికారం కన్సులర్ అధికారులకు ఉంటుంది.
- వయస్సు, ఆరోగ్యం: వృద్ధులు లేదా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వీసా రావడం కష్టమే.
- ఆర్థిక స్థితి: అప్లై చేసే వ్యక్తి ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నాడో గమనిస్తారు.
- భాషా నైపుణ్యం: ఇంగ్లీష్ రాకపోయినా, సరైన చదువు లేకపోయినా వీసా తిరస్కరించే అవకాశం ఉంది.
- గత రికార్డు: గతంలో ఎప్పుడైనా ప్రభుత్వ నగదు సాయం పొంది ఉన్నా ఈ నిబంధన వర్తిస్తుంది.
ప్రభావితమయ్యే దేశాలు ఇవే..
ఈ జాబితాలో మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఇవే కాకుండా రష్యా, బ్రెజిల్, ఈజిప్ట్, నైజీరియా, థాయ్‌లాండ్ వంటి 75 దేశాల వారిపై ఈ ప్రభావం పడనుంది. సోమాలియా వంటి దేశాల్లో జరిగిన ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కారణంగా ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారతీయులకు ఊరట.. కానీ అప్రమత్తత అవసరం!
ప్రస్తుతానికి ఈ 75 దేశాల జాబితాలో భారత్ (India) పేరు లేదు. అంటే భారతీయ విద్యార్థులకు (F1 Visas) లేదా ఉద్యోగులకు (H-1B Visas) నేరుగా ఇబ్బంది లేదు. అయితే భారతీయ విద్యార్థులకు అమెరికా ఒక హెచ్చరిక జారీ చేసింది. అక్కడ చదువుకుంటూ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం ఊరుకోమని స్పష్టం చేసింది. అంటే రూల్స్ అతిక్రమికస్తే కెరీర్, వీసా గోవిందా! అంతేకాకుండా మీ భార్య లేదా భర్త ఈ 75 దేశాల్లో ఏదో ఒక దేశానికి చెందిన వారైతే, వారి గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ఏది ఏమైనా అమెరికా మాత్రం ఇమ్మిగ్రేషన్ పై కఠింగా వ్యవహిరిస్తుంది అని అర్థమవుతోంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతీయులపై కూడా కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం 'ఇమ్మిగ్రెంట్' (శాశ్వత నివాసం) వీసాలకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి టూరిస్ట్ వీసాలు (B1/B2), స్టూడెంట్ వీసాలు, హెచ్-1బి వంటి తాత్కాలిక వీసాలపై వెళ్లే వాళ్లు పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications