IT News: కనికరం కోల్పోయిన టెక్ దిగ్గజ సంస్థ.. సామాన్లు సర్థుకుంటున్న వందల ఉద్యోగులు..
Oracle Layoffs: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్లతో పాటు భారతదేశంలో భారీగా ఉద్యోగులను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఐటీ నుంచి హెల్త్ కేర్ వరకు అనేక రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న టెక్ దిగ్గజం తాజాగా నవంబర్ 1 నుంచి ఉద్యోగుల కోతలకు తెరలేపింది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒరాకిల్ కార్పోరేషన్ దాని ఒరాకిల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారవిభాగంలో ఉద్యోగుల కోతలు ప్రకటించింది. కొన్ని నివేదికల ప్రకారం ఒరాకిల్ తన వ్యాపారం అంతటా వివిధ విభాగాల్లో భారీగా ఉద్యోగుల కోతలు ఉంటాయని సూచించాయి. అయితే ఈ లేఆఫ్స్ ప్రభావం వందలమందిపై ఉండనున్నట్లు సమాచారం. TheLayoff.com సమాచారం ప్రకారం నవంబర్ 1 శుక్రవారం నాడు కొంతమంది అధిక పనితీరు ఉన్నవారితో సహా 15 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసినట్లు వెల్లడైంది. తాజా లేఆఫ్స్ వల్ల 15,000 మంది ప్రభావితం అవుతారని తెలుస్తోంది.

క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రసిద్ధి చెందిన ఒరాకిల్ గతంలోనూ కొన్ని తొలగింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్లాక్ లో చాలా మంది ఉద్యోగులు పోవటం చూస్తుంటే వారాంతం నాటికి మరింత మంది ఉద్యోగుల లేఆఫ్ ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వేతనం ఎక్కువ స్థాయిలో ఉన్న టెక్కీలను తొలగించి వారి స్థానాల్లో ఫ్రెషర్లను తీసుకునే ఉద్ధేశ్యంలో కంపెనీ ఉన్నట్లు ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుత లేఆఫ్స్ అమెరికా వ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభావితం చేసినట్లు వెల్లడైంది.
ఒరాకిల్ ఇతర ఉద్యోగ కోతలను ప్రకటించిన నెల తర్వాత ఈ తాజా రౌండ్ తొలగింపులు వచ్చాయి. ఇందులో అమెరికా, యూరప్, EMEA ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లోని ఉద్యోగులు ఉన్నారు. అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఒరాకిల్ ప్రతి నెల ఉద్యోగుల తొలగింపులను చేస్తూనే ఉంటుందని ఒకరు పేర్కొన్నారు. కంపెనీ ఈ ఉద్యోగ స్థానాలను భారత్ వంటి మార్కెట్లలో తక్కువ ఖర్చుకు దొరికే ఉద్యోగులతో భర్తీ చేయవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications