Microsoft Layoffs: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త ఏడాది కూడా రఫ్ ప్రయాణం తప్పదని ఉద్యోగులకు సంకేతాలను అందిస్తోంది. 2025 ప్రారంభమై వారం రోజులు కూడా గడవకమునుపే తొలగింపులకు సంబంధించిన ప్రకటనతో బాంబు పేల్చింది.
టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన భద్రతా విభాగంతో సహా వివిధ విభాగాల్లో పనితీరు అండర్ పర్పార్మింగ్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ ప్రస్తుతం మరో రౌండ్ ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమైంది. కంపెనీ ప్రస్తుతం మార్కెట్లోని ఇతర ప్రత్యుర్థుల మాదిరిగానే ఉద్యోగుల పనితీరుపై ఫోకస్ పెట్టిందని నివేదికల ప్రకారం తెలుస్తోంది. నిర్వహణను మెరుగుపరిచే వ్యూహంలో భాగంగా తాజా తొలగింపులు జరుగుతున్నాయని సమాచారం. అయితే దీని వల్ల ఎంత మంది ప్రభావితం అయ్యారనే విషయాన్ని అధికారిగా కంపెనీ బయటపెట్టలేదు.

2025లో కంపెనీ ఉత్తమ పనితీరు కనబరచని 1 శాతం ఉద్యోగులను తగ్గించే వ్యూహంతో ముందుకు సాగుతోందని సమాచారం. కంపెనీ హై పర్ఫార్మింగ్ టాలెంట్ పైనే దృష్టి పెడుతున్నట్లు కంపెనీ ప్రతినిధి సీఎన్బీసీతో మాట్లాడుతూ పేర్కొన్నారు. పనితీరు సరిగా లేని వారిపై సమయానుగుణంగా తగిన చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా 2,28,000 మంది ఉద్యోగులు ఉండగా ప్రస్తుత తొలగింపులతో దీనిలో దాదాపు 1 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ప్రభావితం అవనున్నట్లు తెలుస్తోంది.
అలాగే కంపెనీ ప్రస్తుతం ఖాళీ అయ్యే పొజిషన్లను తిరిగి ఫిల్ చేస్తున్నట్లు అందువల్ల ఎలాంటి ఇబ్బంది ఉండబోదని కంపెనీ పేర్కొంది. దీనికి ముందు కూడా మైక్రోసాఫ్ట్ 2023లో కూడా తొలగింపులను చేపట్టింది. అప్పట్లో కంపెనీ దాదాపుగా 10,000 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అప్పట్లో కంపెనీ తన ఎక్స్ బాక్స్ గేమింగ్ విభాగంలో కూడా తొలగింపులు భారీగానే జరిగాయి. ఇక 2024లో యాక్టివిజన్ బ్లిజార్డ్ కంపెనీని 75.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయగా 2000 మంది ఉద్యోగులను కూడా తొలగించింది. దీని తర్వాత కూడా ఇతర విభాగాల్లో 2500 మంది వరకు ఉద్యోగులను తొలగించింది.
పునర్నిర్మాణంలో భాగంగా మైక్రోసాఫ్ట్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య అభివృద్ధిలో గణనీయమైన పెట్టుబడులు పెడుతోంది. మైక్రోసాఫ్ట్ AI టూర్‌లో భాగంగా న్యూదిల్లీ పర్యటన సందర్భంగా సీఈవో సత్య నాదెళ్ల భారతదేశ ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో కొలాబరేషన్‌కు తాము సంసిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో నాదెళ్ల హైదరాబాదులో కూడా పర్యటించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి మరిన్ని పెట్టుబడి అవకాశలపై ఆయనతో చర్చించినట్లు తెలిసింది.
More From GoodReturns

భారత ఐటీ రంగంలో కల్లోలం.. రెండు వైపుల నుంచి తరుముకొస్తున్న రిస్క్.. నిర్మల్ బాంగ్ సంచలన నివేదిక..

వందలాది మంది ఉద్యోగులపై వేటు వేసిన ఒరాకిల్.. లేఆప్స్ తరువాత స్టాక్ మార్కెట్లో పరుగులు పెట్టిన షేర్లు..

Layoffs: ఒరాకిల్ లేఆఫ్స్.. సోషల్ మీడియాలో లీకైన భారీ సెవరెన్స్ ప్యాకేజీ వివరాలు!

Layoffs: ఒరాకిల్ ఎందుకు ఇన్ని వేల మందిని తీసేస్తోంది? లోపల జరుగుతోంది ఇదే!

Layoffs: ఒరాకిల్ లేఆఫ్స్: ఒక్క రోజే 30 వేల మంది ఇంటికి! అసలు కారణం ఇదే!

డెలాయిట్ 50 వేల ఉద్యోగాల ప్రకటన.. 30 వేల మందికి ఏఐపై ప్రత్యేక శిక్షణ..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications