IT News: హైదరాబాద్ టెక్కీలకు లక్కే లక్కు..!! గూగుల్ స్పెషల్ ఫోకస్..
Google Campus: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బెస్ట్ టెక్, బ్యాంకింగ్ కంపెనీలు తమ వ్యాపారాలను హైదరాబాద్ కేంద్రంగా నడిపేందుకు చాలా కాలంగా ఆసక్తి కనబరుస్తున్నాయి. తక్కువ ఖర్చుకే నైపుణ్యాలు కలిగిన యువత తేలికగా అందుబాటులో ఉండటం వీటిని ఈ దిశగా నడిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ గూగుల్ అమెరికాకు బయట తన అతిపెద్ద క్యాంపస్ నిర్మాణం కోసం హైదరాబాదును ఎంచుకోవటంతో టెక్కీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఏఐ, ఆన్ లైన్ అడ్వర్టైజింగ్, సెర్చ్ ఇంజిన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్ వేర్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఈ కామర్స్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి అనేక వ్యాపారాల్లో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కంపెనీ తన వ్యాపార విస్తరణ కార్యకలాపాలకు అనువైన నగరంగా హైదరాబాదును ఎంచుకుంది. ఈ క్రమంలో కొన్ని నెలల కిందట హైదరాబాద్ గచ్చిబౌలిలో అతిపెద్ద క్యాంపస్ నిర్మాణాన్ని ప్రారంభించింది. మెుత్తం 7.3 ఎకరాల విస్త్రీర్ణంలో 30 లక్షల చదరపు అడుగుల అతిపెద్ద క్యాంపస్ నిర్మాణాన్ని శరవేగంగా కంపెనీ కొనసాగిస్తోంది. ఈ స్థలాన్ని కంపెనీ వాస్తవానికి 2019లోనే కొనుగోలు చేసింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ క్యాంపస్ 2026 నాటికి అందుబాటులోకి వస్తుందని సమాచారం.

🚨 The largest Google campus outside of USA is coming up in Hyderabad, India. pic.twitter.com/akPqqna502
— Indian Tech & Infra (@IndianTechGuide) September 24, 2024
గూగుల్ 2023 మార్చిలో తన అతిపెద్ద క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ప్రకటించిన సంగతి తెలిసిదే. వాస్తవానికి న్యూయార్క్‌లోని 111 ఎయిత్ అవెన్యూలోని గూగుల్ బిల్డింగ్ 2.9 మిలియన్ చదరపు అడుగులతో అతిపెద్ద క్యాంపస్ గా కొనసాగుతోంది. అయితే ఇండియాలో నిర్మిస్తున్నది దానికంటే పెద్దదికావటంతో అతిపెద్ద క్యాంపస్‌గా మారబోతోంది. భారతదేశంలో కొత్త క్యాంపస్ కోసం గూగుల్ ఎంపిక విషయంలో జరిగిన పోటీలో హైదరాబాద్ ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూను ఓడించింది. హైదరాబాద్‌లోని గూగుల్ కొత్త క్యాంపస్ దాని అత్యంత నైపుణ్యం కలిగిన టెక్ వర్క్‌ఫోర్స్‌కు ఆరోగ్యకరమైన, సహకార వర్క్‌ప్లేస్‌ను అందజేస్తుందని తెలుస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ గూగుల్‌తో పాటు అమెజాన్ సహా మరిన్ని అంతర్జాతీయ కంపెనీలకు డ్రీమ్ డెస్టినేషన్ కింద మారిపోయింది. హైదరాబాద్ మహానగరం ఐటీ పరిశ్రమలకు కేంద్రంగా మాత్రమే కాకుండా నైపుణ్యం కలిగిన టెక్ వర్క్‌ఫోర్స్ లభ్యత అధికంగా ఉండటంతో ప్రస్తుతం కంపెనీలకు అత్యుత్తమ ఎంపికగా నిలుస్తోంది. హైదరాబాద్ గూగుల్ క్యాంపస్ అందుబాటులోకి వస్తే వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలను కల్పించవచ్చని నిపుణులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వాలు సైతం ఐటీ రంగంతో పాటు ప్రస్తుతం ఏఐ రంగంపై తమ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త నగరాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications