Tech Layoffs: టెక్ కంపెనీ రెండోసారి మెగా లేఆఫ్.. వణికిపోతున్న ఉద్యోగులు..!!
Cisco Layoffs: వాస్తవానికి తాజాగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించటంతో జాబ్ మార్కెట్లు తిరిగి బూమ్ కొనసాగిస్తాయని అందరూ భావిస్తున్నారు. ఐటీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో కొత్త నియామకాల జాతర త్వరలో మెుదలవుతుందని నిపుణులు సైతం చెబుతున్న వేళ అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ సంస్థ 2024లో రెండవసారి తన ఉద్యోగులను భారీ స్థాయిలో తొలగించాలని నిర్ణయించింది. ఇది వ్యాపారంలో దిగ్గజ కంపెనీలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లను పరోక్షంగా ప్రతిబింబిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ సంస్థ సిస్కో గురించే. ఇప్పటికే కంపెనీ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. వ్యాపార కార్యకలాపాల్లో డిమాండ్ తగ్గుముఖం పట్టడం, ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అలాగే కంపెనీ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఏఐ సాంకేతికతలో భారీగా పెట్టుబడులు కూడా పెడుతోంది. ఆగస్టులో కంపెనీ దాదాపు 7% ఉద్యోగాల కోతలను ప్రకటించింది. దీంతో దాదాపు 5,600 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. అలాగే ఫిబ్రవరిలో 4,000 మంది ఉద్యోగులను సైతం తొలగించింది.

నెట్‌వర్కింగ్ పరికరాలకు డిమాండ్ పుంజుకోవడంపై సిస్కో ఆశాజనకంగా ఉన్నట్లు సీఈవో చక్ రాబిన్స్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో కంపెనీ ఏకంగా ఏఐ స్టార్టప్‌లకు 1 బిలియన్ డాలర్లను కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కంపెనీ సైబర్ సెక్యూరిటీ సంస్థ స్ప్లంక్‌ను 28 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి అధిక-వృద్ధి ప్రాంతాలపై దృష్టి సారించేందుకు పునర్నిర్మాణం చేస్తోందన్నారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దాదాపు 85,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వ్యాపార అనిశ్చితుల కారణంగా ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలైన ఇంటెల్, ఐబీఎమ్, సిస్కో సహా అనేక ఇత స్టార్టప్ కంపెనీలు ఉద్యోగుల కోతలను ప్రకటించాయి.
మార్చిలో స్ప్లంక్‌ను 28 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం చందా-ఆధారిత సేవల వైపు సిస్కో వ్యూహాత్మక మార్పును సూచిస్తుంది. AI స్టార్టప్‌లకు సిస్కో నిధులు సమకూరుస్తున్నాయి. ఈ సాంకేతికతలో తన ఉనికిని విస్తరించేందుకు సిస్కో ఏఐ స్పేస్‌లో చురుకుగా పాల్గొంటోంది. 2019లో కంపెనీ సిలికాన్ వన్ ASIC చిప్‌ను ప్రారంభించింది. సిస్కో ఆధునిక డేటా సెంటర్, క్లౌడ్ పరిసరాలకు మద్దతుగా రూపొందించబడిన యూనిఫైడ్ కంప్యూటింగ్ సిస్టమ్, సెక్సస్ స్విచ్‌ల వంటి డేటా సెంటర్ టెక్నాలజీలను అందిస్తుంది. అదనంగా WebEx, Cisco Jabber వంటి వారి సహకార సాధనాలు కమ్యూనికేషన్, ఉత్పాదకతను మెరుగుపరుస్తాయి.


Click it and Unblock the Notifications