Meta News: తొలగించిన ఉద్యోగులకు మెటా శుభవార్త.. గుడ్‌టైమ్ స్టార్ట్ అయ్యిందిగా..
Meta News: మెటా ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 21,000 మంది ఉద్యోగాల కోతను ప్రకటించింది. ఖర్చుల మదింపులో భాగంగా అనేక ప్రోత్సాహకాలను సైతం తొలగించింది. కానీ ఇప్పుడు మంచి రోజులు మెటాలో తిరిగి వచ్చాయి.
అవును కంపెనీ ప్రీ-పాండమిక్ ప్రోత్సాహకాలను తిరిగి ప్రారంభించింది. ఉద్యోగులు దీర్ఘకాలంగా కోల్పోయిన కొన్ని పెర్క్‌లను తిరిగి పొందుతున్నారు.ఈ క్రమంలో కంపెనీ మెన్లో పార్క్, కాలిఫోర్నియా కార్యాలయంలోని చాలా రెస్టారెంట్‌లు తిరిగి తెరవబడ్డాయి. గురువారం హ్యాపీ అవర్స్‌తో పాటు లాండ్రీ సర్వీస్, హెయిర్ కట్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. హైబ్రిట్ వర్క్ విధానాన్ని ప్రోత్సహించేందుకు స్పెషల్ ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

గత సంవత్సరం ఖాళీగా కనిపించిన స్నాక్ బార్, ఫ్రిజ్‌లు కూడా ఇప్పుడు రీస్టాక్ చేయబడ్డాయి. ముఖ్యంగా ప్రముఖ పానీయం లా క్రోయిక్స్ కూడా తిరిగి వచ్చింది. Meta ప్రధాన కార్యాలయం ఈ రుచికరమైన పానీయం వేగంగా స్టాక్ అయిపోవటం ఎక్కువ మంది ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు రావటం ప్రారంభించారనే సంకేతంగా కంపెనీ భావిస్తోంది.
ఆఫీస్ పెర్క్‌ల పునరుద్ధరణ ఉన్నప్పటికీ, ఇది ఇంతకు ముందు అందించిన ప్రయోజనాలకు దగ్గరగా లేదని తెలుస్తోంది. పెర్క్‌లు గతంలో ఉన్నంత మంచివి కావని బ్లూమ్‌బర్గ్ నివేదిక సూచిస్తుంది. లాండ్రీ సేవ ఒకప్పుడు ఉచితంగా ఉండేదని, అయితే ఇప్పుడు దాని కోసం ఉద్యోగులు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడైంది. ఆహారం కూడా మునుపటిలాగా లేదని ఉద్యోగులు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications