Google Layoffs: టెక్ ప్రపంచానికి నిలయమైన అమెరికాలోని కంపెనీలు ప్రస్తుతం లేఆఫ్ మంత్రం జపిస్తున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా ఎంత మందిని తొలగించాలా అని ప్లాన్ చేస్తున్నాయి. పైగా వాటికి సీఈవోగా ఉన్నది ఇండియన్స్ కాబట్టి వారు కాస్ట్ కట్టింగ్ విషయంలో ఎంత ముందుంటారో వేరే చెప్పుకోనక్కర్లేదు.
తాజాగా దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ సైలెంట్ గా ఉద్యోగుల కోతలను కొనసాగిస్తోంది. అయితే దీని వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందని వెల్లడైంది. ఏప్రిల్ 25న గూగుల్ తన మొదటి త్రైమాసిక ఆదాయాల నివేదించటానికి ముందుగానే.. గూగుల్ తన కోర్ టీమ్‌ల నుంచి కనీసం 200 మంది ఉద్యోగులను తొలగించింది. దీనికి బదులుగా పునర్వ్యవస్థీకరణలో కొన్ని పాత్రలను భారత్, మెక్సికోలకు తరలించినట్లు వెల్లడైంది. అమెరికాలో ఉద్యోగులకు చెల్లించే వేతనం కంటే ఈ దేశాల్లో టెక్కీలకు తక్కువ జీతంతో అదే సామర్థ్యాలతో కూడిన పనిని పొందవచ్చని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

వాస్తవానికి కోర్ టీమ్ గూగుల్ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తుల వెనుక సాంకేతిక పునాదిని నిర్మించడం, వినియోగదారుల ఆన్‌లైన్ భద్రతను రక్షించడం వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తుంది. కోర్ టీమ్‌లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పైథాన్ డెవలపర్ టీమ్, టెక్నికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ ఫౌండేషన్, యాప్ ప్లాట్‌ఫారమ్‌లు, కోర్ డెవలపర్‌లు, వివిధ ఇంజినీరింగ్ పాత్రల నుంచి కీలకమైన సాంకేతిక విభాగాలు ఉన్నాయి. కంపెనీ అంతర్గత డేటా ప్రకారం కాలిఫోర్నియాలోని సన్నీవేల్‌లోని కంపెనీ కార్యాలయాల్లో ఇంజనీరింగ్‌లో కనీసం 50 మంది తొలగింపబడ్డారని వెల్లడైంది.
కంపెనీ అంతర్గత పత్రాల ప్రకారం గూగుల్ అనేక ప్రధాన బృందాలు మెక్సికో, భారతదేశంలో సంబంధిత పాత్రలకు ఉద్యోగులను నియమించుకుంటాయని వెల్లడైంది.గూగుల్ డెవలపర్ ఎకోసిస్టమ్ వైస్ ప్రెసిడెంట్ అసిమ్ హుస్సేన్ గత వారం ఒక ఇమెయిల్‌లో తన బృందానికి తొలగింపు వార్తలను ప్రకటించారు. వాస్తవానికి ఆన్‌లైన్ యాడ్ మార్కెట్‌లో తిరోగమనం కారణంగా.. ఆల్ఫాబెట్ గత సంవత్సరం ప్రారంభంలో సుమారు 12,000 మంది ఉద్యోగాలను తొలగించాలని ప్రణాళికలను ప్రకటించినప్పటి నుంచి హెడ్‌కౌంట్‌ను తగ్గిస్తూపోతోంది. కంపెనీ సీఎఫ్ఓ రూత్ పోరాట్ ఏప్రిల్ మధ్యలో కంపెనీ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ పునర్నిర్మాణం, ఉద్యోగుల తొలగింపు.. బెంగుళూరు, మెక్సికో సిటీలకు స్థానాలను మారుస్తుందని ప్రకటించారు .


Click it and Unblock the Notifications