For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Google Layoff: ఉద్యోగులకు గూగుల్ గుడ్ బై..! టార్గెట్ వాళ్లే.. కొత్త విధానంతో గుర్తింపు..

|

Google Layoff: టెక్కీల రంగుల ప్రపంచం ఒక్కసారిగా కూలుతోంది. ఇప్పటి వరకు అంతా సర్థుకుంటుందిలే అనుకున్న అంచనాలు తారుమారయ్యాయి. అనేక మంది వీసాలపై ఇతర దేశాల్లో పనిచేస్తున్న భారతీయ టెక్ నిపుణులు కుదుపును ఎదుర్కొంటున్న సమయంలో గూగుల్ మరో బాంబు పేల్చింది. దీనిని చూసిన చాలా మందికి గుండె ఝల్లుమంటోంది.

6 శాతం ఆవిరి..

6 శాతం ఆవిరి..

ప్రస్తుత క్లిష్ట వ్యాపార వాతావరణంలో గూగుల్ 6 శాతం మంది ఉద్యోగులను వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో దాదాపు 10,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. తొలగించాల్సిన ఉద్యోగులను ఎంపిక చేసేందుకు గూగుల్ ర్యాంకింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. ఇది ఉద్యోగుల పనితీరుకు కంపెనీ ఇచ్చే ర్యాంకింగ్ విధానం. ఆల్ఫాబెట్ ఎదుర్కొంటున్న టఫ్ మార్కెట్ పరిస్థితుల కారణంగా ఉద్యోగులను తగ్గించాలనే ఒత్తిడి ఆర్థికంగా పెరుగుతోంది.

 టార్గెట్ ఉద్యోగులు వారే..

టార్గెట్ ఉద్యోగులు వారే..

పేలవంగా పని చేస్తున్న ఉద్యోగులను గుర్తించి తొలగించాలని గూగుల్ నిర్ణయించింది. దీనికోసం ర్యాంకులు ఇవ్వాల్సిందిగా గుగూల్ తన మేనేజర్‌లను కోరినట్లు సమాచార నివేదిక పేర్కొంది. పనితీరు ఆధారంగానే తొలగింపులు చేయాలని ఉన్నత అధికారులు నిర్ణయించారు.

అధిక జీతాలు..

అధిక జీతాలు..

గూగుల్ గత త్రైమాసికంలో నియామకాల్లో భారీ పెరుగుదలను నమోదు చేసింది. అయితే నిపుణులు మాత్రం పెరిగిన వర్క్‌ఫోర్స్‌తో పాటు జీతాల గురించి గూగుల్‌ను హెచ్చరిస్తున్నారు. బిలియనీర్ యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ క్రిస్టోఫర్ హోన్ మాట్లాడుతూ.. మిగిలిన పరిశ్రమలతో పోల్చితే గూగుల్ ఉద్యోగులకు చాలా ఎక్కువ జీతం ఇస్తోందని పేర్కొన్నారు. వాస్తవ అవసరాన్ని మించి నియామకం జరిగిందని ఆయన అన్నారు.

 గతంలో ప్రకటన..

గతంలో ప్రకటన..

ఈ ఏడాది చివరి త్రైమాసికంలో నియామకాలు నెమ్మదిస్తాయని ఇప్పటికే గూగుల్ వెల్లడించింది. అయితే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలోని వాస్తవ పరిస్థితులు కంపెనీ సాధారణంగా ఊహించినదానికంటే మూడు రెట్లు అధికంగా తొలగింపులు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుత నిర్ణయంతో కంపెనీ కూడా Meta, Twitter, Amazonతో పాటు ఇతర US-ఆధారిత టెక్ కంపెనీల సరసన చేరింది. అయితే ఈ తొలగింపులు వచ్చే ఏడాది సైతం కొనసాగవచ్చని ఐటీ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

English summary

Google Layoff: ఉద్యోగులకు గూగుల్ గుడ్ బై..! టార్గెట్ వాళ్లే.. కొత్త విధానంతో గుర్తింపు.. | US Tech Jaint Google Layoffs poor performing employees

US Tech Jaint Google Layoffs poor performing employees
Story first published: Tuesday, November 22, 2022, 15:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X