Google Layoffs: ఉద్యోగుల కోతలు ఆపని గూగుల్.. ఆ మూడు టీమ్స్‌పై ప్రభావం..
Layoff News: ప్రస్తుతం టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొంత నెమ్మదిస్తున్నాయి. అయితే అసమ్మతి, దుష్ప్రవర్తన కారణంగా దాదాపు 50 మంది ఉద్యోగులను తొలగించిన వారాల తర్వాత గూగుల్ మరోసారి ఉద్యోగుల కోతలకు దిగింది.
ఉద్యోగులను తొలగించడానికి పునర్వ్యవస్థీకరణ ప్రధాన కారణమని గూగుల్ తెలిపింది. గూగుల్ కి చెందిన పైథాన్, డార్ట్, ఫ్లట్టర్ సహా ఇతర బృందాలకు చెందిన ఉద్యోగులను నిష్క్రమించమని కోరింది. కంపెనీ తన అతిపెద్ద ప్రాధాన్యతలు, రాబోయే ముఖ్యమేన అవకాశాల్లో బాధ్యతాయుతంగా పెట్టుబడి పెడుతున్నట్లు గూగుల్ ప్రతినిధి అలెక్స్ గార్సియా-కుమ్మెర్ట్ టెక్ క్రంచ్‌తో అన్నారు. అయితే ఈ సారి తొలగింపుల వల్ల ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్యను గూగుల్ బయటపెట్టలేదు. ఇదే క్రమంలో పని వాతావరణాన్ని మరింత సమర్థవంతంగా మార్చేందుకు బ్యూరోక్రసీ, లేయర్‌లను తగ్గిచటం దిశగా కంపెనీ ముందుకు సాగుతోంది.

తాజాగా టీమ్‌ల నుంచి తొలగించబడిన ఉద్యోగులు ప్రధానంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లతో వ్యవహరిస్తారు. వారికి కంపెనీలో లేదా వెలుపల కూడా పాత్రలను కనుగొనడానికి అవకాశం ఇవ్వడం ద్వారా మద్దతు ఇవ్వబడుతుంది. ఈ బృందాలు పూర్తిగా తొలగించబడలేదు కానీ టెక్ దిగ్గజం కొన్ని పాత్రలను తగ్గించింది.
2024 మొదటి నాలుగు నెలల్లో గూగుల్ వివిధ బృందాల నుంచి వందల సంఖ్యలో తన టెక్ ఉద్యోగులను తొలగించింది. 2023లో కాకుండా 2024లో 12,000 మంది ఉద్యోగులు మూకుమ్మడిగా వెళ్లిపోవాలని కోరినప్పుడు దశలవారీగా తొలగింపులు జరుగుతాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులను హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చిత వ్యాపార పరిస్థితుల్లో అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీలు భారీగానే ఉద్యోగుల కోతలను ప్రకటిస్తున్నాయి.


Click it and Unblock the Notifications