Cognizant: జీతాల పెంపు ప్రకటించిన కాగ్నిజెంట్.. అయినా ఆందోళనలో టెక్కీలు..?
Cognizant: కొత్త ఏడాది ఉద్యోగులు కంపెనీలు జీతాల పెంపుపై ఎలాంటి ప్రకటన చేస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెరికా, యూరప్‌లో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రముఖ భారతీయ ఐటీ సర్వీస్ కంపెనీలన్నీ క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా.. టీసీఎస్, ఇన్ఫోసిస్ సంస్థలు బెంచ్ ఉద్యోగుల సంఖ్య పెరగడాన్ని పెద్ద సమస్యగా చూస్తున్నాయి.
ఈ క్రమంలో కొన్ని టెక్ కంపెనీలు మాత్రం ఉన్న ఉద్యోగులనే ఇంటికి పంపుతున్నాయి. అయితే ఇండియన్ ఐటీ సంస్థలు మాత్రం ఇప్పటి వరకు అలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోకాగ్నిజెంట్.. తమ వద్ద పనిచేస్తున్న 3,00,000 మందికి పైగా ఉద్యోగులకు తక్షణమే జీతాలు పెంచబోతున్నామని కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తెలిపారు.

అయితే ఇక్కడ మరో ఇబ్బంది ఏమిటంటే.. అమెరికా దిగ్గజం యాక్సెంచర్ లేఆఫ్ ప్రకటన చేసింది. ఈ భారీ తొలగింపుల ప్రకటనలో ఎవరిని కంపెనీల ఇంటికి పంపుతుంది.. ఎవరిని ఉంచుతుందని ఆందోళన చేస్తున్నారు. కానీ ఒక విధంగా జీతాల పెంపు ప్రకటన ఆందోళనకర ఆర్థిక పరిస్థితుల్లో ఊరటనిచ్చే ప్రకటనేనని కొంత మంది టెక్కీలు భావిస్తున్నారు.
గడచిన 18 నెలల కాలంలో జీతాలను పెంచటం ఇది మూడోసారి కావటం గమనార్హం. కాగ్నిజెంట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రెబెకా ష్మిత్ తన పదవికి రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత వేతన పెంపు ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో కంపెనీ అట్రిషన్ రేటు క్యూ-4లో 28 శాతం నుంచి 26 శాతానికి తగ్గింది. ఈరోజు దేశీయ టెక్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఫలితాలు మార్కెట్లోకి రానున్నాయి.


Click it and Unblock the Notifications