IBM Jobs: ఇన్నాళ్లుగా టెక్కీలు కట్టుకున్న కలల మేడలు కూలిపోయే సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించొచ్చని ఈ రంగంపై యువత ఎక్కువగా ఇన్నాళ్లు మెుగ్గుచూపుతూ వచ్చారు. కానీ ఇప్పుడు వారి కలలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆవిరి చేస్తోంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు ఎక్కువగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి మారుతున్నాయి. దీంతో సాంప్రదాయ టెక్ ఉద్యోగాలకు ఎసరు తప్పదని తెలుస్తోంది. మరో పక్క కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు కూడా ఈ ఆప్షన్లను ఎంచుకుంటున్నాయి. ఈ క్రమంలో అమెరికా టెక్ దిగ్గజం IBM సంచలన నిర్ణయం తీసుకుంది.

రానున్న సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భర్తీ చేయవచ్చని భావిస్తున్న ఉద్యోగాల కోసం నియామకాలను నిలిపివేయాలని చూస్తోంది. ఈ ఉద్యోగాల నియామకాలను నిలిపివేయాలని భావిస్తున్నట్లు ఐబీఎమ్ సీఈవో అరవింద్ కృష్ణ వెల్లడించారు. ఇందులో భాగంగా హ్యూమన్ రిసోర్సెస్ వంటి బ్యాక్-ఆఫీస్ ఫంక్షన్లలో రిక్రూట్మెంట్స్ నిలిపివేయటం లేదా నెమ్మదిస్తాయని ఆయన వెల్లడించారు.
నాన్-కస్టమర్-ఫేసింగ్ రోల్స్ కింద దాదాపు 26,000 మంది పనిచేస్తున్నట్లు సీఈవో వెల్లడించారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ద్వారా దాదాపు 30 శాతం ఉద్యోగాలు తగ్గుతాయని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. అంటే దాదాపు 7,800 ఉద్యోగాలు పోతాయని చెప్పకనే చెప్పారు. కస్టమర్ కేర్ సర్వీసెస్, కోడింగ్ వంటి ఉద్యోగాలను ఏఐ టూల్స్ ఆక్రమిస్తాయని తెలుస్తోంది. ఇది జాబ్ మార్కెట్లో పెను సంచలనంగా మారనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఐబీఎమ్ సంస్థ 2,60,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. గత ఏడాది కంటే ఇప్పుడు టాలెంటెడ్ ఉద్యోగుల లభ్యత మార్కెట్లో సులభతరమైందని కృష్ణ వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ సుమారు 5000 మంది ఉద్యోగులను తొలగించింది. భారీగా ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలతో ఇటీవలి త్రైమాసికంలో ఐబీఎమ్ మంచి లాభాలను అంచనా వేస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications