Modi US Tour 2023: ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రఖ్యాత కంపెనీల సీఈవోలతో సమావేశమౌతూ కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు.
భారత డిజిటల్ ల్యాండ్‌స్కేప్ మార్చేందుకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అమెజాన్ సీఈవో ఆండ్రూ జాస్సీతో పీఎం మోదీ సమావేశమయ్యారు. పర్యటన సందర్భంగా సమావేశం తర్వాత వారు గణనీయమైన పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించారు. ఈ పెట్టుబడులు డిజిటల్ గ్రాన్మిషన్ ప్రోత్సహించటం, స్థానిక భాషల కంటెంట్‌ను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తుల ఎగుమతిని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ప్రధానితో జరిగిన సమావేశంలో సుందర్ పిచాయ్ గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ప్రారంభించాలనే గూగుల్ ప్రణాళికలను వెల్లడించారు. అలాగే ఇండియా డిజిటలైజేషన్ ఫండ్‌లో గూగుల్ 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుందని, ఇది భారత డిజిటల్ విప్లవాన్ని మరింత వేగవంతం చేస్తుందని వెల్లడించారు. అంతేకాక సమీప భవిష్యత్తులో మరిన్ని భారతీయ భాషల్లో తన వర్చువల్ అసిస్టెంట్ బార్డ్‌ను పరిచయం చేయాలని గూగుల్ యోచిస్తున్నట్లు పిచాయ్ స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో అమెరికాకు చెందిన మరో దిగ్గజ కంపెనీ అమెజాన్ సైతం భారీ పెట్టుబడి ప్రణాళికలతో భారత వ్యాపారాన్ని మరింత విస్తరించాలని చూస్తున్నట్లు సీఈవో ఆండ్రూ జాస్సీ తెలిపారు. ఇప్పటికే 11 బిలియన్ డాలర్లు ఇండియాలో పెట్టుబడిగా పెట్టిన అమెజాన్ దీనికి అదనంగా మరో 15 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని భావిస్తోంది. ఈ ప్రయత్నాలు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని, చిన్న మధ్య తరహా వ్యాపారాల డిజిటలైజేషన్‌కు మద్ధతునిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తుల ఎగుమతిని సులభతరం చేయడానికి ఉపయోగించబడతాయని వెల్లడించారు.


Click it and Unblock the Notifications